ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Errabelli Dayakarrao: ముందు ఎన్టీఆర్‌ కుటుంబాన్ని దగ్గరకు తీసుకో..చంద్రబాబుకు ఎర్రబెల్లి హితవు

ABN, First Publish Date - 2022-12-22T12:55:49+05:30

ఖమ్మం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మూర్ఖంగా అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరంగల్: ఖమ్మం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu)మూర్ఖంగా అబద్ధాలు మాట్లాడారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Telangana Minister Errabelli Dayakarrao) విమర్శించారు. గురువారం జిల్లాలోని రాయపర్తిలో క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవులకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న దుస్తువులను మంత్రి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ...కేసీఆర్ (Telangana CM KCR) హయాంలోనే తెలంగాణ అభివృద్ది జరుగుతోందన్నారు. ఎన్టీఆర్‌ను మోసం చేసి టీడీపీని గుంజుకున్న ఘనత చంద్రబాబుది అని వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలను పట్టించుకోకుండా ఆంధ్రాలో పడ్డ చంద్రబాబు కూడా ఇంకా తెలంగాణ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లనే దగ్గరకు తీసుకోని వ్యక్తి తెలంగాణలోని కార్యకర్తలను పట్టించుకుంటాడా అని ప్రశ్నించారు. ‘‘మొదట ఎన్టీయార్ కుటుంబాన్ని దగ్గరకు తీసుకో.. తర్వాత తెలంగాణ గురించి ఆలోచించు’’ అంటూ హితవుపలికారు. ఎన్టీఆర్‌ను మోసం చేసిన చంద్రబాబుకు టీడీపీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2022-12-22T12:55:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising