మటన్‌ కట్‌లెట్స్‌

ABN , First Publish Date - 2022-05-14T18:07:38+05:30 IST

మటన్‌ - అరకేజీ(బోన్‌లెస్‌), అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, కారం

మటన్‌ కట్‌లెట్స్‌

కావలసినవి: మటన్‌ - అరకేజీ(బోన్‌లెస్‌), అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టేబుల్‌స్పూన్‌, ఉల్లిపాయ - ఒకటి, కొత్తిమీర - ఒకకట్ట, పుదీనా - ఒక కట్ట, పచ్చిమిర్చి - రెండు, కారం - రెండు టీస్పూన్లు, పసుపు - అర టీస్పూన్‌, బంగాళదుంప - ఒకటి, ఉప్పు - రుచికి తగినంత, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - చిన్నముక్క, నూనె - డీప్‌ ఫ్రైకి సరిపడా, గోధుమ బ్రెడ్‌ క్రంబ్స్‌ - కొద్దిగా.


తయారీ విధానం: ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనాను కట్‌ చేసుకోవాలి. బంగాళదుంపను ఉడికించి పొట్టుతీసి గుజ్జుగా చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిని తరగాలి. మటన్‌ను కడిగిన తరువాత నీళ్లు లేకుండా చేతితో గట్టిగా పిండాలి. తరువాత ఒక బౌల్‌లోకి తీసుకుని అందులో అల్లంవెల్లుల్లి పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కారం, పసుపు, బంగాళదుంప, లవంగాలు, దంచిన దాల్చిన చెక్క, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమాన్ని నిమ్మకాయ సైజంత చేతుల్లోకి తీసుకుని కట్‌లెట్స్‌లా ఒత్తుకోవాలి. తరువాత బ్రెండ్‌ క్రంబ్స్‌ అద్దుకుంటూ పక్కన పెట్టుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె పోసి కాస్త వేడి అయ్యాక కట్‌లెట్స్‌ వేసుకుంటూ వేయించాలి. చిన్నమంటపై రెండు వైపులా బాగా కాలేలా వేయించుకోవాలి. పుదీనా చట్నీతో తింటే ఈ మటన్‌ కట్‌లెట్స్‌ రుచిగా ఉంటాయి.

Read more