Grapes Mono Diet: కొత్త డైట్.. వరుసగా మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పళ్లు మాత్రమే తింటే..
ABN , Publish Date - Mar 16 , 2025 | 09:08 PM
ప్రస్తుతం ద్రాక్ష పండ్ల ఆధారిత మోనో డైట్ ట్రెండింగ్‌లో ఉంది. దీని గురించి వైద్యుల అభిప్రాయం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు అనేక మంది కొత్త కొత్త డైట్స్‌ను నెటిజన్లకు పరిచయం చేస్తున్నారు. వీటితో అనేక ఉపయోగాలు ఉన్నాయని ఊదర గొడుతున్నారు. ఇలా ప్రస్తుతం ట్రెండింగ్‌లోకి వచ్చిందే ద్రాక్ష పండ్ల డైట్. మూడో రోజుల పాటు కేవలం ద్రాక్ష మాత్రమే తింటే పలు ఉపయోగాలు కలుగుతాయని ఓ కంటెంట్ క్రియేటర్ చెప్పుకొచ్చారు. దీనిపై నిపుణులు కూడా తమ అభిప్రాయాలు స్పష్టం చేశారు (3 Day Grape Mono Diet).
ఏమిటీ మోనో డైట్
ఒక రోజు నుంచి మూడు రోజుల పాటు ఒకే రకం ఆహారం తినడమే మోనో డైట్. రకరకాల ఫుడ్స్ తినే బదులు ఒకేరకం ఫుడ్ తిని జీర్ణవ్యవస్థపై ఒత్తిడి తగ్గించి ఆరోగ్యం పెంపొందించుకోవడమే ఈ మోనో డైట్ లక్ష్యం. దీంతో, కడుపుబ్బరం, అజీర్ణం, ఇతర కడుపు సంబంధిత సమస్యలన్నీ తొలగిపోతాయట.
Read More: కొబ్బరి నూనెకు ఈ ఐదు కలిపి జుట్టుకు పట్టిస్తే బట్టతల నుంచి ఉపశమనం
ఇక ద్రాక్ష ఆధారిత మోనో డైట్‌తో లింఫాటిక్ వ్యవస్థకు మేలు జరుగుతుందన్న అంశం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. శరీరంలోని కణజాలం విసర్జించే రకరకాల వ్యర్థాలను ఈ లింఫాటిక్ వ్యవస్థ రక్తంలోకి చేరుస్తుంది. అంతిమంగా శరీరం ఈ వ్యర్థాలను విసర్జిస్తుంది. అంతేకాకుండా, పేగుల్లోని ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్లను కూడా మళ్లీ సేకరిస్తుంది. కణజాలం మధ్య అధికంగా పేరుకుపోయిన ద్రవాన్ని రక్తసరఫరా వ్యవస్థలోకి మళ్లిస్తుంది. విషతుల్యాలు, వ్యాధి కారకాలను కూడా తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Read More: కుక్క కరిచినప్పుడు టీకా తీసుకుంటే సరిపోతుందని అనుకుంటున్నారా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే..
ఇక మూడు రోజుల పాటు కేవలం ద్రాక్ష పండ్లే తింటే కొన్ని స్వల్పకాలిక ఉపయోగాలు ఉన్నాయట. ముఖ్యంగా హైడ్రేషన్ మెరుగుపడి శరీరానికి తగినంత నీరు లభిస్తుంది. దీంతో, లింఫాటిక్ వ్యవస్థ పనితీరు కూడా ఓ మోస్తరు స్థాయిలో పెరుగుపడి వ్యర్థాలు తొలగిపోతాయి. జీర్ణ వ్యవస్థను కూడా తాజా పరుస్తుంది. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఇతర సహజసిద్ధమైన చక్కెరలతో తక్షణ శక్తి, జీర్ణవ్యవస్థ మెరుగుపడినా కూడా శరీరానికి ఇతర పోషకాలు అందవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిస్ రోగుల్లో చక్కెర వ్యాధులు ఎగుడుదిగుడు అయ్యి ఇబ్బందులు తలెత్తుతాయని ట్రై చేస్తున్నారు. పూర్తి స్థాయి ఆరోగ్యవంతులు అదీ స్వల్పకాలం పాటు మాత్రమే ఈ డైట్‌ను ప్రయత్నించొచ్చని సూచించారు.