SSC Exams 2025: పదో తరగతి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు: చంద్రబాబు, లోకేశ్..
ABN , Publish Date - Mar 16 , 2025 | 09:28 PM
పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులంతా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) వ్యాప్తంగా సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు (10th class exams) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), మంత్రి లోకేశ్ (Minister Lokesh) పదో తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
పరీక్షలు రాస్తున్న యంగ్ ఫ్రెండ్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రతి విద్యార్థి జీవితంలో పరీక్షలు అనేవి కీలక మైలురాళ్లని చెప్పారు. విద్యార్థులంతా చదువుపైనే దృష్టి పెట్టి కష్టపడి చదవాలని అన్నారు. పరీక్షలు రాసే సమయంలో సమయాన్ని తెలివిగా వాడుకోవాలని సూచించారు. మిమ్మల్ని మీరు నమ్మితే విజయం మీ వెంటే వస్తుందని సీఎం చెప్పుకొచ్చారు.
ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సైతం పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులంతా ధైర్యంగా పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని కోరారు. పరీక్షలు రాసే వారంతా సకాలంలో కేంద్రాల వద్దకు చేరుకోవాలని మంత్రి సూచించారు. ఎలాంటి మానసిక ఒత్తిడికీ గురికావొద్దని సూచించారు. పరీక్షా కేంద్రాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద అన్నీ సౌకర్యాలు కల్పించామని, ప్రతి ఒక్కరూ పరీక్షలపైనే ఫోకస్ పెట్టాలని మంత్రి లోకేశ్ చెప్పారు.
సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకు 3,450 కేంద్రాలను విద్యాశాఖ అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. ఉదయం 9:30 గంటల నుంచీ మధ్యాహ్నం 12:45 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. మరోవైపు ఎగ్జామ్ సెంటర్ల వద్ద అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మాస్ కాపీయింగ్ వంటివి జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Diamond Ring Robbery: టాలీవుడ్ హీరోకి షాక్ ఇచ్చిన దొంగలు..
Namrata Shirodkar: మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా గుండె ఆపరేషన్లు మరింత విస్తృతం: నమ్రత