Share News

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

ABN , Publish Date - Mar 16 , 2025 | 09:05 PM

ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తేడా రావడంతో ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్‌లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది.

Bihar: కేంద్ర మంత్రి ఫోన్ కాల్.. డాక్టర్ కావాలనే విద్యార్థిని ఆశలు సజీవం

పాట్నా: ఒక విద్యార్థిని ఆవేదన అందరి దృష్టిని ఆకట్టుకుంటుంది. కేంద్ర మంత్రి సకాలంలో స్పందించడంతో ఆమె ఆశలు తిరిగి చిగురించాయి. డాక్టర్ కావాలనే ఆ విద్యార్థిని ఆశలకు ఊతం దొరకడంతో ఇప్పుడు ఆమె ముఖంలో తిరిగి సంతోషం కనిపిస్తోంది. బీహార్‌లోని దనపూర్‌కు చెందిన కుష్భూ కుమారి(Kushbhoo Kumari) ఇటీవల ఓ వీడియోలో తన గాథ చెప్పుకొని కన్నీటి పర్యంతమైంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టిలోకి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. విద్యార్థినితో నేరుగా ఫోనులో మాట్లాడి, ఆమె సైన్స్ కోర్స్ చదివేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను అదేశించారు.

PM Modi: భారత శాంతి సందేశం ప్రపంచమంతటా ప్రతిధ్వనిస్తోంది


ఖుష్బూ ఇటీవల 10వ తరగతిలో 500 మార్కులకు 399 మార్కులు సాధించింది. 400 మార్కుల అంచనాలకు ఒక్క మార్కు తక్కువగా రావడంతో తల్లిదండ్రులు ఆమెను బలవంతంగా సైన్స్ కోర్సుకు బదులు ఆర్ట్స్‌లో చేర్పించారు. దాంతో ఆమె కన్నీటిపర్యంతమైంది. డాక్టర్ కావాలనే తన ఆశకు గండికొట్టి ఆర్ట్స్‌లో చేర్చించారని, తన ఇద్దరి సోదరులను మాత్రం సైన్స్‌లో చేర్చించామని ఆమె కంటతడిపట్టింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి వచ్చింది. ఆయన వెంటనే ఖుష్బూతో ఫోనులో మాట్లాడి ధైర్యంగా ఉండమని భరోసా ఇచ్చారు. వెంటనే జిల్లా కలెక్టర్‌తో సైన్స్ విభాగంలో అడ్మిషన్ కోసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. ఆ విషయాన్ని ఖుష్బూకు తెలియజేస్తూ...''నీట్ పరీక్షలకు సిద్ధంగా ఉండు. డాక్టర్ కావాలనే కలను సాకారం చేసుకో"అని మంత్రి భరోసా కల్పించారు.


కేంద్ర మంత్రికి కృతజ్ఞత

సైన్స్ కోర్సు(బయాలజీ)లో అడ్మిషన్ కల్పించేందుకు భరోసా ఇచ్చిన కేంద్ర మంత్రికి ఖుష్బూ కృతజ్ఞతలు తెలిపింది. ''ఒక నాటికి నేను డాక్టర్‌ను అవుతాను'' అని మరింత ధీమా వ్యక్తం చేసింది.


ఇవి కూడా చదవండి..

PM Modi: ట్రంప్‌ను మిత్రుడుగా ఇష్టపడతారా? లీడర్‌గానా?.. మోదీ ఏం చెప్పారంటే

MK Stalin: ఏఆర్ రెహమాన్ ఆరోగ్యంపై సీఎం స్టాలిన్ అప్‌డేట్

Shahi Jama Masjid: వివాదాస్పద షాహి జామా మసీదుకు పెయింటింగ్..

Viral Video: ఇది కదా పోలీసుల పవర్.. నడిరోడ్డుపై గూండాలకు చుక్కలు..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 16 , 2025 | 09:07 PM

News Hub