రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలు
ABN, First Publish Date - 2023-10-30T08:13:10+05:30
కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. 32 మందిని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది.
విజయనగరం : కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాద ఘటనలో 40 మందికి గాయాలయ్యాయి. 32 మందిని విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది. విశాఖ ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో ఒకరిని, మెడికవర్ ఆసుపత్రిలో ఇద్దరిని చేర్పించామన్నారు. క్షతగాత్రులంతా ఆంధ్రప్రదేశ్‌కి చెందినవారేనన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. వీరిలో ఒకరిని విశాఖకు తరలించి చికిత్సను అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి పేర్కొన్నారు.
చికిత్స పొందుతూ మృతి..
విజయనగరంలో జరిగిన రైలు ప్రమాదంలో పెందుర్తి ప్రాంతానికి చెందిన వరలక్ష్మి స్వల్పంగా గాయపడింది. చికిత్స నిమిత్తం రాత్రి పెందుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. రైలు ప్రమాదంలో గాయపడిన మహిళకు ప్రథమ చికిత్స చేసి వైద్యులు ఇంటికి పంపించి వేశారు. అలాగే రైలు ప్రమాదంలో గాయపడిన మెట్టవలస గ్రామానికి చెందిన టంకాల సుగుణమ్మ (65) తెల్లవారు జామున చికిత్స పొందుతూ మృతి చెందింది.
Updated Date - 2023-10-30T08:13:10+05:30 IST