TDP: టీడీపీలో చేరిన ముగ్గురిపై కేసు నమోదు
ABN, First Publish Date - 2023-03-07T19:27:23+05:30
వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు నేతలపై అన్నమయ్య జిల్లా కలికిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా టీడీపీ జాతీయ
కలికిరి: వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ముగ్గురు నేతలపై అన్నమయ్య జిల్లా కలికిరి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదయింది. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra)లో భాగంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) సోమవారం రాత్రి కలికిరి చేరుకున్నారు. ఈ సందర్భంగా కలికిరి మేజర్ పంచాయతీ సర్పంచు రెడ్డివారి ప్రతాప్‌కుమార్ రెడ్డి, మహల్ మాజీ సర్పంచు ఎర్రదొడ్డి సతీష్‌కుమార్ రెడ్డి, మునేళ్ళపల్లెకు చెందిన బీసీ నేత కోటకొండ రవి తమ అనుయాయులతో కలిసి నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఈ ముగ్గురిపై కలికిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాణా సంచా కాల్చడం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే కారణాలతో వీరిపైన కేసు నమోదయింది. సెక్షన్ 188 ఐపీసీ, 9 (బి)(1)(బి) కింద ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సోమవారం రాత్రి 1500 కుటుంబాలతో కలిసి ఈ ముగ్గురూ వైసీపీ (YCP) నుంచి టీడీపీ (TDP)లో చేరారు. పార్టీలో చేరిన గంటల వ్యవధిలోనే వీరిపై కేసులు నమోదు చేయడం చర్చనీయాంశమయింది.
Updated Date - 2023-03-07T19:27:23+05:30 IST