ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Roads in AP: ఏపీలో రోడ్ల దుస్థితికి నిలువుటద్దం ఈ ఒక్క ఘటన..!!

ABN, First Publish Date - 2023-07-23T13:06:24+05:30

ఏలూరులో ఓ యువకుడు రోడ్ల దుస్థితిపై వినూత్నంగా నిరసన తెలిపాడు. మడుగులా మారిన రోడ్డు మధ్యలో మంచం వేసుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్ పేట దగ్గర రోడ్డు మీద నీరు నిలిచిపోయి మడుగులా మారిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో తన ఇంటి ముందు రోడ్డుపై ఈ విధంగా యువకుడు నిరసన తెలిపాడు.

ఏలూరు: ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి ఏ రేంజ్‌లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్వాన్నమైన రోడ్లతో ఏపీవాసులు నిత్యం నరకం చూస్తున్నారు. ఇక చినుకు పడిందంటే చాలు రోడ్ల సంగతి వర్ణనాతీతంగా మారిపోతోంది. ఈ క్రమంలోనే ఏలూరులో ఓ యువకుడు రోడ్ల దుస్థితిపై వినూత్నంగా నిరసన తెలిపాడు. మడుగులా మారిన రోడ్డు మధ్యలో మంచం వేసుకొని పడుకొని నిరసన వ్యక్తం చేశాడు. ఏలూరు జిల్లా కేంద్రం నుంచి మాదేపల్లి వెళ్లే రోడ్డులో ఫిల్‌హౌస్ పేట దగ్గర రోడ్డు మీద నీరు నిలిచిపోయి మడుగులా మారిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఆగ్రహించిన సదరు యువకుడు నిరసనగా ఆ మడుగులో మంచం వేసుకున్నాడు. అటుగా వస్తున్న బస్సును ముందుకు వెళ్లనీయకుండా గంటసేపు ఆపి నిరసన తెలియజేశాడు. అయితే బస్సు ప్రయాణానికి అంతరాయం ఏర్పడడంతో స్థానికులు యువకుడికి సర్దిచెప్పి పక్కకు తీసుకొచ్చారు. దీంతో బస్సు కదిలి వెళ్లింది. ఈ ఘటననకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని రోడ్డు దుస్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏలూరు, కైకలూరు వెళ్లేందుకు ఇదే ప్రధాన రహదారి అని, ఫిల్‌హౌస్ పేట రోడ్డు వెంబడి నిత్యం అనేక వాహనాలు వెళ్తుంటాయని స్థానికులు చెబుతున్నారు. ప్రధానంగా ఆర్టీసీ బస్సులు, చేపల లోడులు వెళ్తుంటాయి. అయితే ఈ రోడ్డుపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి. ఇక ఇటివల కురిసిన వర్షాలకు రోడ్లు మరింత దారుణంగా దెబ్బతిన్నాయి. రోడ్లు బాగుచేయాలని జనాలు ఎప్పటి నుంచో మొరపెట్టుకుంటున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులను కోరినా ఎలాంటి స్పందన లేదు. ఈ రోడ్డు దుస్థితిపై మూడు రోజుల క్రితమే ఏబీఎన్ (ABN) ఒక కథనాన్ని ప్రసారం చేసింది. రోడ్లు దుస్థితిపై జనసేన నాయకులు నిరసన చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న అధికారులు రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Updated Date - 2023-07-23T13:06:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising