Narayana: మాజీమంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై హైకోర్టులో విచారణ వాయిదా
ABN, First Publish Date - 2023-10-10T14:39:55+05:30
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు సీఐడీ నోటీసులపై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి(బుధవారం) వాయిదా వేసింది.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణకు (Former Minister Narayana) సీఐడీ నోటీసులపై (CID Notice) విచారణను ఏపీ హైకోర్టు(AP High Court) రేపటికి(బుధవారం) వాయిదా వేసింది. నారాయణ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణకు రాగా.. సీఐడీ విచారణకు సంబంధించి తనను ఆరోగ్య కారణాలు దృష్ట్యా పరిగణలోకి తీసుకోవాలని నారాయణ కోరారు. దీనిపై రేపు విచారిస్తామని న్యాయమూర్తి చెప్పారు.
మరోవైపు ఇదే కేసులో సీఐడీ నోలీసులు అందుకున్న నారాయణ అల్లుడు పునీత్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. పునీత్‌ను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు విచారించాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్‌కు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే సీఐడీ నోటీసులపై మంత్రి నారాయణ అల్లుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ నోటీసులను సస్పెండ్ చేయాలని పునీత్ కోరారు. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు మాత్రమే పునీత్‌ను విచారించాలంటూ సీఐడీని హైకోర్టు ఆదేశించింది.
Updated Date - 2023-10-10T14:58:25+05:30 IST