ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vakapalli case: వాకపల్లి కేసులో కోర్టు తీర్పుపై ఉద్యమించండి: మావోయిస్ట్ గణేశ్‌

ABN, First Publish Date - 2023-04-08T21:46:15+05:30

వాకపల్లి (Vakapalli) మహిళలపై అత్యాచారం కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాడేరు: వాకపల్లి (Vakapalli) మహిళలపై అత్యాచారం కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ (Maoist Party) ఏవోబీ స్పెషల్‌ జోనల్‌ కమిటీ కార్యదర్శి గణేశ్‌ పిలుపునిచ్చారు. ఆయన పేరిట శనివారం మీడియాకు లేఖ విడుదలైంది. వాకపల్లికి చెందిన 11 మంది ఆదివాసీ మహిళలపై కూంబింగ్‌ పోలీసులు అత్యాచారానికి పాల్పడిన ఘటనలో తొలి నుంచి బాధితులకు అన్యాయం చేసే విధంగానే ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన పోలీసులపై చర్యలు చేపట్టాలని పెద్దఎత్తున ఉద్యమాలు జరిగినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ఈ కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లి, తిరిగి విశాఖపట్నం (Visakhapatnam)లోని ఎస్‌సీ, ఎస్‌టీ స్పెషల్‌ కోర్టుకు వచ్చినా... విచారణాధికారులు సక్రమంగా విచారణ చేపట్టలేదని, బాధితులైన మహిళలను, వారికి అండగా నిలిచేవారిని, న్యాయవాదులను పోలీస్‌ శాఖ, ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేశాయని ఆరోపించారు.

అలాగే మహిళలకు అండగా ఉన్న వారికి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని తప్పుడు కేసులు బనాయించడం, వేధింపులకు గురిచేయడం వంటివి అధికంగా జరిగాయని మావోయిస్టు నేత గణేశ్‌ పేర్కొన్నారు. తాము ఆదివాసీల ఉద్ధారకులమని ప్రేమను ఒలకబోసే పాలక పార్టీ నేతలు, ఈ తీర్పుపై మౌనం వహించి తమ నిజస్వరూపాన్ని చాటుకున్నారన్నారు. ఈ వ్యవస్థలో ఆదివాసీలు, దళితులు, మైనార్టీలకు న్యాయం జరగదని కోర్టు తీర్పు మరోమారు చాటి చెప్పిందన్నారు. ఈ తీర్పును ఖండిస్తూ ప్రగతిశీలశక్తులు, ప్రజలు, విద్యార్థులు, మేధావులు, మహిళలు, హక్కుల సంఘాలు సంఘటితంగా ఉద్యమించాలని మావోయిస్టు పార్టీ నేత గణేశ్‌ పిలుపునిచ్చారు.

Updated Date - 2023-04-08T21:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising