ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Janasena: పొత్తులు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే: మనోహర్‌

ABN, First Publish Date - 2023-05-13T21:34:44+05:30

వచ్చే ఎన్నికల్లో పొత్తులు కేవలం వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెనాలి: వచ్చే ఎన్నికల్లో పొత్తులు కేవలం వ్యక్తి ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ (Nadendla Manohar) స్పష్టం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో ఇటీవల కురిసిన వర్షాలకు పంట దెబ్బతిన్న పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర హితం కోసం, మన భవిష్యత్‌ కోసం ప్రభుత్వం మారాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కలసి మాట్లాడిన సందర్బంలో కూడా పదవులు, సీట్ల విషయంపై ఏమీ మాట్లాడలేదని, వారు రాష్ట్ర హితం కోరే జగన్‌ సర్కారు మార్పు ఆవశ్యకతపై చర్చించారని తెలిపారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రాన్ని జగన్‌ సర్కారు అంధకారంలోకి నెట్టిందని దుయ్యబట్టారు. చీకట్ల నుంచి వెలుగులోకి తీసుకురావలసిన అవసరం తమపై ఉందన్నారు. అవినీతి లేని పాలన తమ లక్ష్యమని ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు, ఎన్నికల వ్యూహాన్ని ప్రజలముందుంచిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని, వారి నిర్ణయమే తమకు శిరోధార్యమని మనోహర్ స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-13T21:34:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising