ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: ఆనందనిలయం వీడియో భద్రతా వైఫల్యమే: ఈవో ధర్మారెడ్డి

ABN, First Publish Date - 2023-05-12T19:43:27+05:30

శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ (Cell phone)తో ప్రవేశించి ఆనందనిలయాన్ని చిత్రీకరించడం భద్రతా వైఫల్యమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అంగీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: శ్రీవారి ఆలయంలోకి ఓ భక్తుడు సెల్‌ఫోన్‌ (Cell phone)తో ప్రవేశించి ఆనందనిలయాన్ని చిత్రీకరించడం భద్రతా వైఫల్యమేనని టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) అంగీకరించారు. ఆనందనిలయాన్ని వీడియో తీసిన రాహుల్‌రెడ్డి అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే భద్రతా సిబ్బందిని మభ్యపెట్టి ఆలయంలోకి సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్‌లో గుర్తించామన్నారు. అయితే సెల్‌ఫోన్‌ ఆలయంలోకి ప్రవేశించడం సిబ్బంది నిర్లక్ష్యానికి కూడా కారణం కావడంతో భద్రతాధికారుల నివేదిక మేరకు ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న వారిని సస్పెండ్‌ చేస్తామన్నారు. తిరుమలలో అత్యాధునిక భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. రెండు గంటల పాటు శ్రీవారి ఆలయంలో విద్యుత్‌ సరఫరా లేదనడం అవాస్తవమని కొట్టిపారేశారు. 24 గంటల పాటు తిరుమల (Tirumala)లో కరెంట్‌ ఉంటుందని తెలిపారు. తిరుమలలో సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్లే ఆనంద నిలయాన్ని వీడియో తీసిన వ్యక్తిని గుర్తించగలిగామని పేర్కొన్నారు. త్వరలో ఆధునిక భద్రతా పరికరాలను, స్కానింగ్‌ యంత్రాల ను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు భద్రతా సిబ్బందిని నియమిస్తామని ధర్మారెడ్డి తెలిపారు.

వేసవిలో దర్శనానికి వచ్చే భక్తులు సహనంతో ఉండాలి

తిరుమలలో వేసవి రద్దీ ప్రారంభమయ్యిందని ధర్మారెడ్డి తెలిపారు. శ్రీవాణి, ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఎస్‌ఎస్‌డీ, దివ్యదర్శనం టోకెన్లు కలిపి మొత్తం 55 వేలు కేటాయిస్తున్నామని, సర్వదర్శనంలో రోజుకు 10 నుంచి 15 వేల మందికి మాత్రమే దర్శనం చేయించే అవకాశముందన్నారు. ఈ క్రమంలో దర్శనానికి వచ్చే భక్తులు సహనంతో దర్శనం చేసుకోవాలని కోరారు. మరోవైపు టీటీడీ పేరుతో భక్తులను మోసగిస్తున్న 52 నకిలీ వెబ్‌సైట్లను, 13 నకిలీ మొబైల్‌యాప్‌లను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌, యాప్‌లోనే దర్శన టికెట్లు, ఆర్జితసేవలు, గదులు బుక్‌ చేసుకోవాలన్నారు. నకిలీ వెబ్‌సైట్లను గుర్తిస్తే 155257 నెంబరుకు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. గత నెలలో 20.95 లక్షల మంది శ్రీవారిని దర్శించుకోగా, రూ.114.12 కోట్లు హుండీ కానుకలు లభించాయన్నారు. 1.01 కోట్ల లడ్డూలను విక్రయించామని తెలిపారు.

Updated Date - 2023-05-12T19:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising