ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ananta YCP Leaders: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీచరణ్‌కు బిగ్ షాక్

ABN, First Publish Date - 2023-06-13T12:12:03+05:30

జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో మంత్రి తీరును అసమ్మతి వర్గనేతల తీవ్రంగా వ్యతిరే్కిస్తున్నారు. చివరకు ఈరోజు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి వ్యవసాయ క్షేత్రంలో అసమ్మతి వర్గ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మంత్రి ఉషాశ్రీ చరణ్‌కు(Minister Usha Sri Charan) బిగ్ షాక్ తగిలింది. నియోజకవర్గంలో మంత్రి తీరును అసమ్మతి వర్గనేతల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మంత్రి వ్యవహార శైలితో విసిగిపోయిన అసమ్మతి నేతలు ఈరోజు (మంగళవారం) ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఎంపీ తలారి రంగయ్య సన్నిహితుడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి వ్యవసాయ క్షేత్రంలో అసమ్మతి వర్గ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి ఉషాశ్రీ చరణ్ పట్టించుకోవడంలేదని నేతలు మండిపడుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddireddy Ramachandrareddy) హాజరైన విజయోత్సవ సభలోనూ ఎంపీపీలు, జడ్పీటీసీలకు తీవ్ర అవమానం జరిగిందంటూ అసమ్మతి వర్గ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘అయ్యా జగన్ మోహన్ రెడ్డి.. ఆర్థికంగా నష్టపోయినా పర్లేదు.. మా ఆత్మభిమానాన్ని తాకట్టు పెట్టవద్దు. నాన్ లోకల్ వద్దు.. లోకల్ వ్యక్తులకే టికెట్ ఇవ్వండి’’ అంటే మొరపెట్టుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా మంత్రి తీరును సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్న పరిస్థితి. వైసీపీ నేతలపైనే బెదిరింపులు, కేసులు పెట్టిస్తున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి ఉష శ్రీ చరణ్ తీరును నిరసిస్తూ వైసీపీ అధిష్టానానికి బలమైన సంకేతాలు పంపేందుకు అసమ్మతి వర్గం సమావేశం నిర్వహించింది. దీనిపై అధిష్టానం ఏమేరకు స్పందింస్తూ చూడాలి మరి.

Updated Date - 2023-06-13T12:18:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising