ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bopparaju: తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధమవుతాం..

ABN, First Publish Date - 2023-05-14T11:34:49+05:30

అనంతపురం: నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అనంతపురం: నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. ఆదివారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నారని.. ఉద్యోగులు ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతుంటే... ప్రభుత్వం లెక్కల విషయంలో సమాధానం చెప్పడం లేదని ఆరోపించారు. తీవ్రస్థాయి ఉద్యమానికి సిద్ధవుతున్నామని అన్నారు.

ఈ నెల 17 నుంచి దశాలవారిగా శాంత యుత ఉద్యమాలు..30వ తేదీ వరకు చేస్తామని బొప్పరాజు తెలిపారు. ప్రజలు కూడా తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని.. ప్రాంతీయ సదస్సులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఉద్యమాలు చేస్తున్న ఉద్యోగులను అణచివేసే కుట్ర ప్రభుత్వం చేస్తోందని, అన్ని ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని, ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపిచ్చారు. మరొక సారి ఛలో విజయవాడ లాంటి ఆలోచన కార్యక్రమం రాకముందే.. ప్రభుత్వం స్పందించాలని కోరారు.

మా డిమాండ్ల న్యాయమైనవి...

తమ డిమాండ్లు న్యాయమైనవని.. ప్రభుత్వం కచ్చితంగా పరిష్కరించాలని బొప్పరాజు అన్నారు. ఉద్యోగులకు, ఉద్యోగ నాయకులకు మధ్య మనస్పర్థలు సృష్టించారని, ప్రభుత్వ పెద్దలకు సమయం ఇచ్చామని.. ఇక నమ్మే పరిస్థితి లేదన్నారు. ఆత్మగౌరవం కోసం చేస్తున్న ఉద్యమాన్ని ఉద్యోగులంతా గమనించాలన్నారు. 30వ తేదీ తరువాత మరో పెద్ద ఉద్యమానికి సిద్ధమవుతామని బొప్పరాజు స్పష్టం చేశారు.

Updated Date - 2023-05-14T11:34:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising