ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kalva Srinivasulu : కాపు రామచంద్రారెడ్డి కుప్పిగంతులకు పోలీసుల కాపలా

ABN, First Publish Date - 2023-10-10T11:41:53+05:30

కాపు రామచంద్రారెడ్డి అనుచరులు కుప్పిగంతులు వేస్తూ ఉంటే పోలీసులు కాపల కాస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా డీజేలు పెట్టి తాగి గంతులు వేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు.

అనంతపురం : కాపు రామచంద్రారెడ్డి అనుచరులు కుప్పిగంతులు వేస్తూ ఉంటే పోలీసులు కాపల కాస్తారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగేలా డీజేలు పెట్టి తాగి గంతులు వేస్తే పోలీసులు రక్షణ కల్పిస్తున్నారన్నారు. టీడీపీ నేతలు బయటకు అడుగుపెట్టకుండా పోలీసులు అడ్డంకులు, ఆంక్షలు సృష్టిస్తున్నారన్నారు. స్వేచ్ఛగా నడవడానికి, మాట్లాడటానికి లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హక్కులు పోలీసులు కాలరాస్తున్నారన్నారు. రాయదుర్గం సీఐ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డీఎస్పీకి చెబుదామంటే తన కాల్ లిఫ్ట్ చెయ్యరని శ్రీనివాసులు అన్నారు.

వారం రోజుల్లో రాయదుర్గంలో ఆరు కేసులు నమోదు చేశారని.. అన్ని కేసుల్లో తనను ఏ1గా నమోదు చేశారన్నారు. అక్రమ కేసులపై అడగడానికి రాయదుర్గం వెళుతుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. అనంతపురం జిల్లాలోని మొత్తం సీఐలు, వందలమంది పోలీసులు తన ఇంటి వద్దే ఉన్నారన్నారు. తమ అధినాయకుడుని నెల రోజులుగా జైలులో బంధించారన్నారు. రాయదుర్గంలో టీడీపీ చేస్తున్న నిరాహార దీక్ష శిబిరాన్ని బలవంతగా ఖాళీ చేయించారని శ్రీనివాసులు అన్నారు. రాయదుర్గం పోలీస్టేషన్‌కు వెళ్లి తనపై పెట్టిన అక్రమ కేసుల గురించి అడుగుతానన్నారు. టీడీపీ చేస్తున్న ఆందోళనలో స్వచ్చందంగా ప్రజలు పాల్గొంటున్నారన్నారు. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి కాపు రామచంద్ర రెడ్డి భయపడుతున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు.

Updated Date - 2023-10-10T11:48:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising