ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: పెను ప్రమాదాన్ని తప్పించిన ఆర్టీసీ డ్రైవర్.. స్పృహ కోల్పోతున్నప్పటికీ...

ABN, First Publish Date - 2023-04-15T11:57:30+05:30

జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం ఉదయం ఆర్టీసీ బస్సు కర్నూల్ నుంచి రాయదుర్గం వెళుతుండగా కళ్యాణదుర్గంలో డ్రైవర్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బస్సు డ్రైవింగ్ చేస్తూనే స్పృ తప్పి పడిపోయాడు. అయితే తాను స్పృహతప్పే సమయంలోనూ డ్రైవర్ ఎంతో అప్రమత్తంగా ఉండటంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్పృహతప్పే కొద్ది నిమిషాల ముందే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి స్టీరింగ్ మీద పడిపోయాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సమయంలో బస్సులో మొత్తం 54 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ప్రయాణిలు, బస్ కండెక్టర్ కలిసి.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు డ్రైవర్ సహాయంతో అస్వస్థతకు గురైన డ్రైవర్‌ను కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రభుత్వాస్పత్రిలో డ్రైవర్ చికిత్స పొందుతున్నాడు. తీవ్రమైన అలసట కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన ఆర్టీసీ అధికారులు అక్కడకు చేరుకుని డ్రైవర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అయితే అస్వస్థతకు గురైన సమయంలో డ్రైవర్ ఎంతో సమయస్ఫూర్తితో బస్సును నిలిపియేయడం వల్లే ఎలాంటి ప్రమాదం జరుగలేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఎలాంటి ప్రమాదం జరకపోవడంతో ఆర్టీసీ అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2023-04-15T12:09:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising