ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sri Sathya Sai Dist.: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు

ABN, Publish Date - Dec 25 , 2023 | 08:58 AM

శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల పర్యటన ఖర్చులపై ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

శ్రీ సత్యసాయి జిల్లా: మడకశిర తహసీల్దార్ ముర్షావలిపై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ పి.అరుణ్ బాబు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు, అధికారుల పర్యటన ఖర్చులపై ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చులను భరించలేక రైతుల నుంచి లంచం తీసుకోవాల్సి వస్తుందంటూ ఓ రైతుతో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో తహసీల్దార్ ముర్షావలిని కలెక్టర్ ఈ మేరకు సస్పెండ్ చేశారు.

పూర్తి వివరాలు... హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యటనలో పాన్ కేక్ తేవడం కోసం సత్యసాయి జిల్లా అధికారులు బెంగళూరుకు వెళ్లారు. మంత్రులు, రాష్ట్ర ఉన్నతాధికారుల పర్యటన ఖర్చులపై మడకశిర ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ‘‘హ్యాండ్లూమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఓ టెర్రర్ అంట.. ఆమెకు బాత్ రూమ్‌లో గీత ఉండకూడదంట.. బెడ్ రూమ్‌లోకి ఈగ రాకూడదట.. దానికి ఎంత ఖర్చయింటుందో మీరే అర్థం చేసుకోండి.. వాళ్లు తినే ఫుడ్ మడకశిరలో దొరకదు... హిందూపురం నుంచి తెప్పించాం.. వాళ్ల ఫుడ్ మెనూ చూస్తే భయపడిపోతారు.. ఇంత లిస్ట్ వుంది చూడండి.. పాన్ కేక్ ఇక్కడ దొరకదు.. బెంగళూరులో దొరుకుతుంది. అక్కడి నుంచి తెప్పించాం.. ఇంత మెనూ ఇస్తే ఎమ్మార్వో, వీఆర్వో ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి.. అధికారులు డబ్బులు తీసుకుంటున్నారని అంటారు.. ఇదంతా ఎవడబ్బ సొమ్ము.. ఎవరికీ మా బాధ అర్థం కాదు... మేము చెప్తేనే బయటకు తెలుస్తుంది.. రాముడు కాలంలోనే లంచం ఉంది.. ఏ ముఖ్యమంత్రి ఏ ప్రధానమంత్రి అవినీతికి పాల్పడలేదు.. ఓ మంత్రి మడకశిర పర్యటనకు వస్తే రూ. లక్ష 75 వేలు ఖర్చు అయ్యింది.. ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి రాదు’’ అంటూ ఎమ్మార్వో ముర్షావలి ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - Dec 25 , 2023 | 08:58 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising