ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantapuram Dist.: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం

ABN, First Publish Date - 2023-11-21T08:24:54+05:30

అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ప్రభుత్వ పశు వైద్యశాలను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. వారికి కావాల్సిన విధంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు రికార్డులు మార్చారు.

అనంతపురం జిల్లా: రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేతల నిర్వాకం బయటపడింది. బొమ్మనహళ్ మండలం, గోవిందవాడలో ప్రభుత్వ పశు వైద్యశాలను వైసీపీ నేతలు అమ్ముకున్నారు. వారికి కావాల్సిన విధంగా రెవెన్యూ, ఇంజనీరింగ్ అధికారులు రికార్డులు మార్చారు. 2001 సంవత్సరంలో పశు వైద్యశాల నిర్మాణానికి కావలసిన స్థలమును సిద్ధమ్మ అనే మహిళ దానంగా ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం నిర్మించిన భవనం కావడంతో మరమ్మతులు చేయాలని ఉన్నతాధికారులకు సిబ్బంది నివేదించారు.

దీంతో శరణబసప్ప, బళ్లారి నాగమ్మ ఇదే అదునుగా చేసుకుని రెవెన్యూ రికార్డులు మార్పించి స్థలాన్ని మరొకరికి విక్రయించారు. 170-సీ సర్వే నంబర్‌లో 0.03 సెంట్ల స్థలం శరణబసప్పకు హక్కు ఉందంటూ రెవెన్యూ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. 20 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం హయాంలో నిర్మించిన పశువైద్యశాల భవనం 50 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు ఇంజనీరింగ్ అధికారులు సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో కొనుగోలుదారుడు చిదానంద స్వామి వైసీపీ నేతల అండదండలతో పశు వైద్యశాలను కూల్చివేశారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Updated Date - 2023-11-21T08:25:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising