ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvaGalam: లోకేష్ యువగళం పాదయాత్రకు జేసీ సంఘీభావం

ABN, First Publish Date - 2023-03-29T12:31:06+05:30

టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంఘీభావం ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

శ్రీసత్యసాయి: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి (Former MP JC Diwakar Reddy) సంఘీభావం ప్రకటించారు. పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లిలో లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra) లో జేసీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం (YCP Government) పై ప్రజలు అసహ్యంతో ఉన్నారన్నారు. టీడీపీ యువనేత నారా లోకేష్ వెంట ప్రజలు నడుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేకత పాదయాత్రలో కనిపిస్తుందని అన్నారు. ప్రజలు రోడ్లపై రావడానికి సిద్ధంగా ఉన్నారని.. జగన్ మీద ఉన్న వ్యతిరేకతతోనే ఎమ్మెల్సీ ఎన్నికలను స్వీప్ చేశారన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు చెప్పేది కరెక్టే అని అన్నారు. ప్రభుత్వం ఆ విధంగా చేస్తుంది అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి వెల్లడించారు.

కాగా.. నల్లగొండ్రాయనపల్లి నుంచి 54వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తున్నారు. పాదయాత్రలో భాగంగా సోమందేపల్లిలో లోకేష్‌కు పార్టీ కార్యకర్తలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. లోకేష్‌ని కలిసి తమ బాధలు చెప్పుకోవడానికి ప్రజలు భారీగా రోడ్లపైకి వచ్చారు. తనని కలవడానికి వచ్చిన యువత, మహిళలు, వృద్ధులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పన్నుల భారం తగ్గిస్తామని మహిళలకు లోకేష్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-03-29T12:31:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising