scorecardresearch

తమిళుల దైవభక్తి

ABN , First Publish Date - 2023-04-06T00:18:18+05:30 IST

తమిళుల దైవభక్తి, విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. తమిళనాడులో బుధవారం పంగణి నక్షత్రాన్ని పురస్కరించుకుని, సుబ్రహ్మణ్యసామికి కల్యాణం, రథోత్సవాలను నిర్వహిస్తారు.

తమిళుల దైవభక్తి

- ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు

- వీపు, నాలుకకు ఇనుప శూలాలు, కొక్కేలు

హిందూపురం అర్బన, ఏప్రిల్‌ 5: తమిళుల దైవభక్తి, విన్యాసాలు ఒళ్లు గగుర్పొడిచాయి. తమిళనాడులో బుధవారం పంగణి నక్షత్రాన్ని పురస్కరించుకుని, సుబ్రహ్మణ్యసామికి కల్యాణం, రథోత్సవాలను నిర్వహిస్తారు. తమిళనాడు నుంచి వలస వచ్చి హిందూపురంలోని సూగూరు ప్రాంతం ఫళణినగర్‌, ఇందిరానగర్‌లో స్థిరపడిన తమిళులు ఆదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. బుధవారం సుబ్రహ్మణ్యసామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అగ్నిగుండ ప్రవేశం చేశారు. అనంతరం చిన్నాపెద్ద తేడాలేకుండా నోటికి, కడుపు, వీపు భాగాల్లో శూలాలు గుచ్చుకుని, భక్తి చాటారు. కొంతమంది వీపు, కాళ్లకు కొక్కేలు తగిలించుకుని, క్రేనకు వేలాడుతూ విన్యాసాలు చేశారు. ఇలా మొక్కుబడులు చెల్లించుకున్నారు. వారి విన్యాసాలను చూసిన పట్టణ వాసులు ఆశ్చర్యపోయారు. తమిళులతోపాటు హిందూపురం వాసులు కూడా చాలామంది సుబ్మహ్మణ్యస్వామికి మొక్కుబడులు తీర్చుకున్నారు.

Updated Date - 2023-04-06T00:18:18+05:30 IST