ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మంత్రి ఉషశ్రీచరణ్ ముఖ్య అనుచరుడి బెదిరింపులు.. సోషల్‌మీడియాలో వైరల్

ABN, First Publish Date - 2023-10-17T13:22:10+05:30

మంత్రి ఉషశ్రీ చరణ్ ముఖ్య అనుచరుడు, శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్ బెదరింపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

అనంతపురం: మంత్రి ఉషశ్రీ చరణ్ (Minister Ushasri Charan) ముఖ్య అనుచరుడు, శెట్టూరు జడ్పీటీసీ మంజునాథ్ బెదరింపులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే పీకేది పీకుతాం.... చంపేది చంపుతాం అంటూ మంజునాథ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్‌ చల్ చేస్తున్నాయి. మంజునాథ్ బెదిరింపులకు ఓ కుటుంబం ప్రాణం భయంతో గ్రామం వదిలిపెట్టి వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. శెట్టూరు మండలం అయ్యగార్లపల్లి గ్రామానికి చెందిన సుధాకర్‌కు చెందిన భూమి విషయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సుధాకర్‌ను కిడ్నాప్ చేసి మరి 21 ఎకరాలను మంజునాథ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ క్రమంలో సుధాకర్‌ను బెదిరస్తూ.. ‘‘వెయ్యి మంది కాదు లక్ష మంది అడ్డు వచ్చినా వదిలిపెట్టేది లేదు. ఇదే లాస్ట్ వార్నింగ్ రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే ఇక చెప్పేది లేదు చేసి చూపిస్తాం. చింతర్లపల్లి సమీపంలోనే వాహనంతో గుద్దిపడేసేవాణ్ణి.... నీ తమ్ముడో బామ్మర్ది తప్పించుకుని బతికిపోయాడు’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మంజునాథ్ బెదిరింపులతో సుధాకర్ కుటుంబసభ్యులు ప్రాణభయంతో గ్రామం వదిలిపెట్టి ఇతర ప్రాంతాల్లో తలదాచుకున్నారు. మిగిలిన భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోకుంటే చంపుతామని బెదిరిస్తున్నారంటూ సుధాకర్ కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2023-10-17T13:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising