ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Anantapuram: సర్పంచ్‌కు చుక్కలు చూపించిన వైసీపీ ఎమ్మెల్యే..

ABN, First Publish Date - 2023-09-24T10:10:05+05:30

అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి.. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్పకు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు.

అనంతపురం: రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి (Kapu Ramachandra Reddy).. ఎర్రగుంట్ల వైసీపీ సర్పంచ్ వన్నూరమ్మ భర్త హనుమంతప్ప (Hanumantappa)కు చుక్కలు చూపించారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి రాకుంటే చర్యలు తీసుకుంటామంటూ బెదిరించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మండిపడ్డ హనుమంతప్ప గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ‘నేను వచ్చేది లేదు.. నా భార్యను పంపేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అంటూ ఎదురు సమాధానం ఇచ్చారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన మమ్మల్ని ఎమ్మెల్యే తీవ్ర అవమానాలకు గురిచేసారని హనుమంతప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రగుంట్ల గ్రామంలో ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోరని, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయకుండా అడ్డుకున్నారంటూ కాపు రామచంద్రారెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఇప్పుడు ఈ ఆడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Updated Date - 2023-09-24T10:10:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising