ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayanagaram train accident: పట్టాలపై మరో ఘోరం.. విజయనగరంలో విషాదం

ABN, First Publish Date - 2023-10-30T02:25:35+05:30

కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్‌ను...

10 మంది దుర్మరణం

పలాస ప్యాసింజర్‌ను ఢీకొట్టిన రాయగడ రైలు

60 మందికిపైగా గాయాలు

కేబుల్‌ సమస్యతో ఆగిపోయిన ప్యాసింజర్‌

అదే లైన్‌లో వెనుక నుంచి ఢీకొట్టిన మరో రైలు

ఇంజన్‌, గార్డు బోగీ, మరో రెండు బోగీలు నుజ్జు

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం

రెండు రైళ్లూ విశాఖ నుంచి బయలుదేరినవే

విజయనగరం జిల్లాలో ప్రమాదం

స్తంభించిన రైళ్ల రాకపోకలు

విశాఖ మార్గంలో పలుచోట్ల నిలిపివేత

జామి/లక్కవరపుకోట/ఎ్‌స.కోట, అక్టోబరు 29: కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఘోరాన్ని మరచిపోకముందే... మరో రైలు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్యాసింజర్‌ను... అదే పట్టాలపై వచ్చిన మరో ప్యాసింజర్‌ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. విజయనగరం జిల్లా అలమండ- కంటకాపల్లి స్టేషన్ల మధ్య జరిగిన ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. తొలుత ఆరుతో మొదలైన మృతుల సంఖ్య... సమయం గడిచేకొద్దీ పెరుగుతూ పోయింది. సంఘటన స్థలం వద్ద నెలకొన్న పరిస్థితులు, క్షతగాత్రుల సంఖ్యను చూస్తే... మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రైల్వే అధికారులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం వివరాలివి...

పలాస ప్యాసింజర్‌ రైలు ఆదివారం సాయంత్రం 5.45 గంటలకు విశాఖలో బయలుదేరింది. విజయనగరం జిల్లా కొత్తవలస దాటిన తర్వాత ఓహెచ్‌ఆర్‌ కేబుల్‌లో సమస్య తలెత్తడంతో... 6.30 గంటల సమయంలో అలమండ మిడిల్‌ లైన్‌లో ఆగిపోయింది. అరగంట వరకు రైలు అక్కడి నుంచి కదల్లేదు. మరోవైపు... విశాఖపట్నం నుంచి సాయంత్రం 6 గంటలకు రాయగడ ప్యాసింజర్‌ విశాఖ నుంచి బయలుదేరింది. కేబుల్‌ సమస్యతో అదే పట్టాలపై మరో రైలు ఆగి ఉందన్న సమాచారం వెనుక వస్తున్న రైళ్లకు అందాలి. అవన్నీ ఎక్కడికక్కడ ఆగిపోవాలి. లోపం ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, విశాఖ-రాయగడ ప్యాసింజర్‌ రైలు అదే పట్టాలపైకి వచ్చేసింది. ఆగకుండా పరుగులు తీసింది. రాత్రి 7 గంటల సమయంలో పలాస ప్యాసింజర్‌ను వెనుక వైపు నుంచి బలంగా ఢీకొట్టింది. ఆ సమయంలో రాయగడప్యాసింజర్‌ గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పలాస ప్యాసింజర్‌ బోగీ, దాని ముందున్న మహిళల బోగీలు బాగా దెబ్బతిన్నాయి. పలాస పాసింజర్‌ ట్రైన్‌ మేనేజర్‌ (గార్డు)తో పాటు రాయగడ పాసింజర్‌ రైలు లోకో పైలట్‌ మృతిచెందగా, మరో లోకోపైలట్‌ తీవ్రంగా గాయపడినట్టు తెలిసింది. ఇక రాయగడప్యాసింజర్‌ ఇంజన్‌, దీని వెనుక ఉన్న బోగీ కూడా దెబ్బతిన్నాయి.


భీతావహ పరిస్థితి...

విశాఖకు రోజు కూలి పనులకు, ఉద్యోగాలు, ఉపాధి నిమిత్తం వెళ్లే వాళ్లు విశాఖ-పలాస ప్యాసింజర్‌ రైలులో ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ప్రమాదం జరిగిన సమయంలోనూ రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు. అంతకుముందె కొత్తవలస స్టేషన్‌లోనే సుమారు 150 మంది వరకు ఎక్కారు. అనుకోని ప్రమాదంతో అక్కడ హాహాకారాలు మిన్నంటాయి. చీకటి వల్ల సహాయక చర్యలు చేపట్టడం కష్టంగా మారింది. తోటి ప్రయాణికులు, స్థానికుల సహకారంతో క్షతగాత్రులను అతికష్టంమీద బయటికి తీశారు. నలిగిన బోగీల మధ్య ఇరుక్కుపోయినవారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. విషయం వెంటనే విశాఖ నుంచి రైల్వే అధికారులు, ఆర్పీఎఫ్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి బయలుదేరారు. కట్టర్ల ద్వారా బోగీల భాగాలను విడదీస్తూ లోపల ఇరుక్కుపోయిన వారిని బయటికి తీయడం మొదలుపెట్టారు. క్షతగాత్రులను విజయనగరం కేంద్రాసుపత్రి, విశాఖపట్నం కేజీహెచ్‌లకు తరలించారు. 108 వాహనాలతోపాటు, సుమారు 15 ప్రైవేటు అంబులెన్స్‌లను వినియోగించారు. విజయనగరం జిల్లా కలెక్టరు నాగలక్ష్మి, పోలీసులు సహాయ చర్యలను పర్యవేక్షించారు.

Updated Date - 2023-10-30T07:12:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising