ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: కరెంట్ కోతలపై ప్రభుత్వానివి గందరగోళ ప్రకటనలు

ABN, First Publish Date - 2023-09-05T12:57:53+05:30

ఏపీలో కరెంట్ కోతలపై ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: ఏపీలో కరెంట్ కోతలపై ప్రభుత్వం గందరగోళ ప్రకటనలు చేస్తోందని ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి (AP BJP Chief Daggubati Purandeshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోతలు ఉంటాయని ఒకసారి, ఉండవని మరోసారి ప్రకటన చేశారన్నారు. అంటే విద్యుత్ విధానంపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. గ్రామాల్లో తొమ్మిది గంటల విద్యుత్ అని జగన్ (AP CM Jagan reddy) హామీ ఇచ్చారని.. ఇప్పుడు అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారని తెలిపారు. ప్రజలు రోడ్ల పైకి వచ్చి విద్యుత్ కార్యాలయాలను ముట్టడించే పరిస్థితి ఏర్పడిందన్నారు. 240 మిలియన్ యూనిట్లు ఒక రోజుకు అవసరమని.. 198 మిలియన్ యూనిట్లు మాత్రమే మనకు అందుతోందన్నారు. 40మిలియన్ యూనిట్లు కొరత ఉందని అన్నారు. విద్యుత్ కొనుగోళ్లులో పీపీఎలను జగన్ సీఎం అవగానే రద్దు చేశారన్నారు. జగన్ ప్రభుత్వం ప్రకటనలతో పెట్టుబడిదారులు రాని పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. రైతులు, గ్రామీణ ప్రజలు కరెంటు కోతలతో ఇబ్బందులు పడుతున్నారని.. వారికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. విద్యుత్ అవసరాలు, వినియోగంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబరులోనే ఉష్ణోగ్రతలు ఎక్కువుగా ఉన్నాయన్నారు. వచ్చే వేసవి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆందోళన చెందారు. విద్యుత్ కోతలు నివారించాల్సిన సీఎం విదేశీ పర్యటనకు వెళ్లిపోయారని.. ఈ అంశాలపై రాష్ట్ర ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని పురందేశ్వరి ప్రశ్నించారు.

Updated Date - 2023-09-05T13:05:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising