ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Purandeshwari: ఏపీలో ఇసుక దోపిడీపై పురందేశ్వరి ఫైర్

ABN, First Publish Date - 2023-10-31T11:18:31+05:30

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక దోపిడీపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి(AP BJP Chief Purandeshwari) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కోట్లాది రూపాయల మేర ఇసుక దోపిడీ జరిగిందని ఆరోపించారు. ప్రజా సమస్యలని ప్రస్తావించడం తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తాను వివిధ అంశాలను ప్రస్తావిస్తోంటే.. తనపై విమర్శలు చేశారని మండిపడ్డారు. ఏపీలో ఇసుక దోపిడీ జరుగుతోందన్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.వేయికి లభించేదని.. కానీ ఇప్పుడు రూ. 5 నుంచి 6 వేలుగా ఉందన్నారు. ఇసుక ధరలు పెరగడం వల్ల సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇసుక ధర పెరగడంతో నిర్మాణ రంగం కుదేలైందని అన్నారు. దీంతో సుమారు 35 లక్షల మంది ఉన్న భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక పాలసీని మార్చి.. ఒకే కాంట్రాక్టరుకు ఇచ్చారన్నారు. ఎవ్వర్నీ పోటీకి రానివ్వకుండా జేపీ వెంచర్సుకు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్ లీజ్ ఇవ్వకూడదనే నిబంధన ఉందని.. కానీ దాన్ని ఉల్లంఘించారని మండిపడ్డారు.


శేఖర్ రెడ్డికి సంబంధించిన టర్న్ కీ ఎంటర్ ప్రైజెస్‌కు జేపీ వెంచర్స్ సంస్థ సబ్ లీజుకు ఇచ్చిందన్నారు. సబ్ లీజ్ తీసుకున్న టర్న్ కీ సంస్థను పంపేసి.. కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అనధికారికంగా కట్టబెట్టారని ఆరోపించారు. జిల్లాల వారీగా ఇసుక రీచులను అమ్మేశారన్నారు. ఇసుక దోపిడీలో భాగంగా తాడేపల్లి ప్యాలెస్‌కు రూ. 2 వేల కోట్లు వెళ్లాయన్నారు.ర హైదరాబాద్‌లోని సుధాకర్ అనే వ్యక్తి ఈ ఇసుక దందాను పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇసుక దోపిడీకి ఓ ఐఏఎస్ అధికారి సహకరిస్తున్నట్టు తమవద్ద సమాచారం ఉందన్నారు. జేపీ వెంచర్స్ సంస్థతో ఒప్పందం ముగిసిన తర్వాత కూడా ఇంకా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని.. అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని విమర్శించారు. బిల్లుల్లో ఉండే లెక్కలకూ.. జరుపుతోన్న తవ్వకాలకు భారీ వ్యత్యాసం ఉందన్నారు. భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నాయని.. కానీ దాన్ని ఉల్లంఘిస్తున్నారన్నారు. నదీ గర్భంలో తవ్వకాలు జరపకూడదనే నిబంధనలున్నా.. రోడ్లు వేసి మరీ డీప్ డ్రెడ్జింగ్ చేసేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వర్షాకాలంలో తవ్వకూడదనే నిబంధనలను ఉల్లంఘిస్తున్నారన్నారు. పరిధిని మించి తవ్వకాలు యధేచ్ఛగా జరుగుతున్నాయని పురంధేశ్వరి వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-10-31T11:18:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising