ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: రాజధాని రైతులకు కౌలు చెల్లింపు పిటిషన్‌పై విచారణ వాయిదా

ABN, First Publish Date - 2023-09-22T12:39:49+05:30

రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో మూడు వారాలకు వాయిదా పడింది.

అమరావతి: రాజధాని రైతులకు కౌలు చెల్లించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ ఏపీ హైకోర్టులో (AP Highcourt) మూడు వారాలకు వాయిదా పడింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై విచారణకు రాగా.. రైతుల తరపున సీనియర్ న్యాయవాది వున్నం మురళీధర్ వాదనలు వినిపించారు. కౌలు చెల్లించాలని జీవో ఇచ్చినా ఇప్పటి వరకు చెల్లించలేదని కోర్టుకు తెలియజేశారు. మనం రాజధాని రైతులు ఇచ్చిన భూమిలో నిర్మించిన భవనంలో పని చేస్తున్నామని ఈ సందర్భంగా మురళీధర్ అన్నారు. సొసైటీ తరపున వేసిన పిటీషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ న్యాయవాది జగన్మోహన్ రెడ్డి వాదించారు. ముందు రైతులకు కౌలు చెల్లించాలని న్యాయవాది మురళీధర్ కోరారు. మురళీధర్ లేవనెత్తిన అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని సీఆర్డీఏను కోరిన హైకోర్టు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

Updated Date - 2023-09-22T12:39:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising