CM Jagan: నాన్నా.. మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది
ABN, First Publish Date - 2023-09-02T10:59:00+05:30
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్థంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు.
అమరావతి: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) 14వ వర్థంతి సందర్భంగా తనయుడు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohhan Reddy) ట్విట్టర్ వేదికగా నివాళులర్పించారు. వైఎస్సార్‌తో ఉన్న అనుబంధాన్ని, ప్రజలకు ఆయన సేవలను మరోసారి జగన్ గుర్తుచేసుకున్నారు. ‘‘నాన్నా… మీరు లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది. భౌతికంగా మా మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో చిరకాలం జీవించే లీడర్ మీరు. మీ పట్ల ప్రజలకున్న ప్రేమాభిమానాలు నాకు కొండంత అండగా నిలిచాయి. మీ ఆశయాలే సంక్షేమం, సమగ్రాభివృద్ధి లక్ష్యాల సాధనలో నన్ను చేయిపట్టి నడిపిస్తున్నాయి. వర్ధంతి సందర్భంగా మీకు ఘనంగా నా నివాళులు నాన్నా’’ అంటూ జగన్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-09-02T10:59:00+05:30 IST