ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Andhra Pradesh: ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలం

ABN, Publish Date - Dec 15 , 2023 | 08:37 PM

Andhra Pradesh: ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ మేరకు అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదని సర్కారు స్పష్టం చేయడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు.

ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెకు దిగిన నేపథ్యంలో అమరావతిలోని సచివాలయంలో అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. ఈ మేరకు అంగన్వాడీ సంఘాల నేతలతో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చలు జరిపారు. అయితే ప్రభుత్వంతో అంగన్వాడీ సంఘాల చర్చలు విఫలమయ్యాయి. వేతనాలు పెంచేది లేదని సర్కారు స్పష్టం చేయడంతో అంగన్వాడీలు సమ్మె కొనసాగించాలని నిర్ణయించారు. గడిచిన నాలుగు రోజులుగా అంగన్వాడీ కేంద్రాలను మూసివేసి అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారు. వేతనాల పెంపు, గ్రాట్యూటీ లాంటి డిమాండ్లతో అంగన్వాడీలు సమ్మెకు దిగారు. విధులకు హాజరు కాకపోతే ఉద్యోగం నుంచి తొలగిస్తామని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరించింది.

కాగా అంతకుముందు అంగన్వాడీలతో చర్చలు సఫలం అవుతాయని భావిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మె విరమిస్తారని ఆశిస్తున్నామన్నారు. మొత్తం 11 డిమాండ్లపై చర్చ జరిగిందని.. వాటిలో కొన్ని డిమాండ్లను అంగీకరించామని పేర్కొన్నారు. ఇంకొన్ని డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలను స్వాధీనం చేసుకోమవి ప్రభుత్వం ఆదేశం ఇవ్వలేదని బొత్స స్పష్టం చేశారు. కొన్ని చోట్ల అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగులకొట్టి ఉండొచ్చని.. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు.


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 15 , 2023 | 08:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising