ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Assembly: సభలో జీపీఎస్‌ సిస్టమ్ బిల్లు 2023ను ప్రవేశపెట్టిన ఏపీ సర్కార్

ABN, First Publish Date - 2023-09-27T13:42:21+05:30

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లును టేబుల్ అజెండా ఐటెంగా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. జీపీఎస్ సిస్టమ్ బిల్లు 2023ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. సీపీఎస్‌ను సమీక్షించాలని ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు.

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session_ కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ బిల్లును (GPS Bill)టేబుల్ అజెండా ఐటెంగా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. జీపీఎస్ సిస్టమ్ బిల్లు 2023ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Minister Buggana Rajendranath) సభలో ప్రవేశపెట్టారు. సీపీఎస్‌ను సమీక్షించాలని ఉద్యోగులు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రులు, అధికారులు కమిటీ చాలా అంశాలను పరిశీలించి జీపీఎస్‌ను రూపొందించిందని తెలిపారు. పలు విడతలుగా ఉద్యోగులతో చర్చించిన తర్వాత గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను ఓ హైబ్రీడ్ మోడల్‌గా కేబినెట్ ఆమోదించిందని చెప్పారు. ఉద్యోగులంతా ప్రభుత్వంలో ముఖ్యమైన భాగమని.. ప్రభుత్వాన్ని కాపాడుకోవటంలో ఉద్యోగులు కీలకంగా నిలవాలని అన్నారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్‌ను చట్టంగా రూపొందించేందుకు శాసనసభలో ప్రవేశపెటామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెల్లడించారు.

Updated Date - 2023-09-27T13:42:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising