ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Govt: మరో 1,000 కోట్ల అప్పుకు ఇండెంట్

ABN, First Publish Date - 2023-06-17T15:45:18+05:30

ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వం మరోసారి అప్పు బాట పట్టింది. మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 9 ఏళ్లకు రూ.500 కోట్లు, 17 ఏళ్లకు మరో రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ వద్ద వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆర్థిక ఇబ్బందులతో వైసీపీ సర్కారు సతమతమవుతోంది. వైసీపీ ప్రభుత్వం (YCP Government) మరోసారి అప్పు (Debt) బాట పట్టింది. మరో రూ.1000 కోట్ల అప్పు కోసం ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది. 9 ఏళ్లకు రూ.500 కోట్లు, 17 ఏళ్లకు మరో రూ.500 కోట్ల రుణం తీసుకునేందుకు జగన్ సర్కారు ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే మంగళవారం రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank) వద్ద వెయ్యి కోట్ల సెక్యూరిటీ బాండ్ల వేలం వేయనుంది. ఈ వెయ్యి కోట్లతో ఈ ఏడాది ఎఫ్‌ఆర్‌బీఎంలో 20 వేల 500 కోట్లు ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఈ 10 వేల కోట్లతో రాబోయే తొమ్మిది నెలలకు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏపీ ప్రభుత్వానికి ఏర్పడింది. కేంద్రం అదనపు రుణ పరిమితి ఇవ్వని పక్షంలో ఏపీ ఆర్ధిక సంక్షోభంలో కూరుకున్నట్లేనని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వారం క్రితం 1,000 కోట్లు తెచ్చిన ప్రభుత్వం

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 13వ తేదీ, మంగళవారం నిర్వహిస్తున్న సెక్యూరిటీల వేలంలో పాల్గొని వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఇంకో రూ.1000 కోట్ల అప్పు తీసుకొచ్చింది. దీనితో 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకూ ఆర్బీఐ ద్వారా రూ.19,500 కోట్ల అప్పు చేసింది. మరోవైపు పదీ పదిహేను రోజులకొకసారి రాష్ట్రం నుంచి ఆర్థికమంత్రి, అధికారులు ఢిల్లీ వెళ్లడం, అప్పులు తేవడం ఆనవాయితీగా మారింది. ఓ వైపు అక్రమ అప్పుల లెక్కలు చెప్తేనే కొత్త అప్పులకు అనుమతంటూ హెచ్చరిస్తూనే మరోవైపు వేల కోట్ల రూపాయల కొత్త అప్పులకు కేంద్రం అనుమతిస్తూనే ఉంది. ఆర్థిక సంవత్సరంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని అప్పులు చేయాలనేది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) నిర్దేశించింది. రాష్ట్ర ప్రభుత్వాల జీఎస్డీపీ ఆధారంగా కేంద్రం ఈ పరిమితిని నిర్ణయిస్తుంది. ఏడాదికొక్కసారే ఈ పరిమితిని నిర్ణయిస్తారు. ఆ పరిమితి మేరకు రాష్ట్రాలకు ఏడాదికి రెండుసార్లుగా కేంద్రం అనుమతిస్తుంది. కానీ, రాష్ట్రం విషయంలో మాత్రం కేంద్రం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది.

Updated Date - 2023-06-17T16:20:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising