ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Governor: వైఎస్సార్ అచీవ్‌మెంట్ అవార్డులు ఇవ్వడం సంతోషదాయకం

ABN, First Publish Date - 2023-11-01T12:36:09+05:30

ఏపీ ప్రజలందరికీ గవర్నర్ నజీర్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

విజయవాడ: ఏపీ ప్రజలందరికీ గవర్నర్ అబ్దుల్ నజీర్ (AP Governor Abdul Nazeer) రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఏ కన్వెన్షన్ లో వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం నజీర్ మాట్లాడుతూ... సాగునీటి రంగంలో, వ్యవసాయంలో, వైద్య రంగంలో 108 లాంటి సేవలు అందించిన వైఎస్ఆర్ ప్రజలకు ఎప్పుడూ గుర్తు ఉంటారన్నారు. ఏపీలో మొదలు పెట్టిన 108 సేవలు దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు వైఎస్‌ఆర్‌ కృషి ఉందన్నారు. సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ఆయన కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన చేసిన సేవలకు వైయస్ పేరిట ఈ అచీవ్‌మెంట్‌ అవార్డులు ఇవ్వటం సంతోషదాయకమన్నారు. సంక్షేమ పథకాలతో పాటు కొన్ని ఇండికేటర్‌లలో ఏపీ అగ్రగామిగా ఉందని తెలిపారు. 76 రెవెన్యూ డివిజన్‌లు, 108కి పైగా పోలీస్ సబ్ డివిజన్‌లు ఏర్పాటుతో పాలన సులభతరం అయ్యిందన్నారు. ఏపీ ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ నజీర్ పేర్కొన్నారు.

Updated Date - 2023-11-01T12:36:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising