ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Amaravati : రాజధాని ప్రాంతం పరిధిలో గ్రీన్ జోన్ రద్దు.. భూముల ధరలు ఢమాల్!

ABN, First Publish Date - 2023-08-28T22:28:33+05:30

ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్‌ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. .

అమరావతి : ఏపీ రాజధాని అమరావతి (AP Capital Amaravati) ప్రాంతం పరిధిలో ఉన్న గ్రీన్ జోన్‌ను (Green Zone) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో.. నివాస ప్రాంతాలకు 500 మీటర్లు దాటి కూడా అనుమతులు ఇచ్చేందుకు సీఆర్డీఏకు (CRDA) అధికారం ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థలు, డెవలపింగ్ సంస్థల అభ్యర్థనలు మేరకు ఈ ఉత్తర్వులు జారీచేసినట్లు జగన్ సర్కార్ (Jagan Govt) చెబుతోంది. ఈ మేరకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్-282ను జగన్ సర్కార్ రద్దు చేసింది. దాని స్థానంలో తాజాగా.. జీవో నంబర్-113ను రాష్ట్ర ప్రభుత్వం జారీచేసింది. సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో అమరావతిలో భూముల ధరలు (Amaravati Lands Rate) తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు.. భూముల ధరలను తగ్గించడానికే ప్రభుత్వం ఇలా కుట్ర చేస్తోందని రాజధాని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఇలా నడుస్తుండగానే..!

కాగా.. ఇప్పటికే అమరావతిలోని ఆర్‌-5 జోన్‌లో (R-5 Zone) ఇళ్ల నిర్మాణంపై అటు ప్రభుత్వం, ఇటు రాజధాని రైతులు కోర్టు మెట్లెక్కారు. ఇళ్ల నిర్మాణాలపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన విషయం విదితమే. ఈ మేరకు పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యానికి సుప్రీం రిజిస్ట్రీ డైరీ నంబరును కేటాయించింది. అయితే.. ఈ కేసులో తమ వాదనలు వినకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దని ఇప్పటికే అమరావతి ప్రాంత రైతులు కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ వ్యవహారం ఇలా నడస్తుండగానే తాజాగా రాజధానిలో ఇలా గ్రీన్ జోన్ రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి


Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఊహించని పరిణామం.. ఈ దెబ్బతో ఏమవుతుందో..?


BRS First List : 115 మంది అభ్యర్థులను ప్రకటించి.. గెలుపు వ్యూహాల్లో ఉన్న కేసీఆర్‌కు అనూహ్య పరిణామం


KCR Revenge Politics : బీఆర్ఎస్‌ను వీడుతానన్న రేఖా నాయక్.. గంటలోపే కేసీఆర్ సర్కార్ ఝలక్


Jagan London Tour : విదేశీ పర్యటన అనుమతి కోసం హైకోర్టులో జగన్, విజయసాయి పిటిషన్.. ఎల్లుండి ఏం జరుగుతుందో..?



Updated Date - 2023-08-28T22:31:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising