Coromandel Express: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుల లెక్క తేల్చిన ఏపీ ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-06-03T16:00:04+05:30
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express)లో ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది.
అమరావతి: కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ (Coromandel Express)లో ఆంధ్రప్రదేశ్‌లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను ఏపీ ప్రభుత్వం (AP Government) వెల్లడించింది. జనరల్ బోగీల్లో ఉన్న ప్రయాణికుల సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. రిజర్వేషన్ క్యాటగిరీలో ఉన్న ప్రయాణికుల ఫోన్ నెంబర్లు తీసుకొని వారి కుటుంబసభ్యులతో రైల్వే అధికారులు మాట్లాడుతున్నారు. రిజర్వేషన్ బోగీల్లో ఏపీకి చెందిన ప్రయాణికులు మొత్తం 163 మంది ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో 78 మంది క్షేమంగా ఉన్నామని ఏపీ అధికారులకు ప్రయాణికులు తెలిపారు. మిగిలినవారిలో 13 మంది ఫోన్‌లు స్విచ్ ఆఫ్ అయ్యాయి. మరో 12 ఫోన్‌లు అందుబాటులో లేవు. 29 ఫోన్‌లు పనిచేయడం లేదు. 12 ఫోన్‌లు బిజీగా ఉన్నాయంటూ సమాధానమిస్తున్నాయి. బోగీల వారీగా అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఏపీలోని అన్ని జిల్లాలకు ప్రయాణికుల జాబితాలను పంపి ఆయా జిల్లాల కలెక్టర్‌లను ఆచూకి తెలియని వారి కుటుంబ సభ్యులతో మాట్లాడాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు.
హౌరా నుంచి చెన్నై వస్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఒరిస్సాలోని బాలాసోర్ దగ్గరలోని బహానగర్ బజార్ స్టేషన్ సమీపంలో అదే ట్రాక్‌పై ఉన్న గూడ్స్ రైలును శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో ఢీకొట్టింది. అదే సమయంలో పక్క ట్రాక్‌లో యశ్వంత్‌పూర్ నుంచి హౌరా వెళుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ బోగీలు యశ్వంత్‌పూర్ హౌరా రైలుకు తగి లాయి. దీంతో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ 12 బోగీలు పట్టాయి. రైలు ప్రమాదంలో ఇప్పటివరకూ 261 మంది ప్రాణాలు కోల్పోయినట్లు దక్షిణ తూర్పు మధ్య రైల్వే (South Eastern Railway) వెల్లడించింది.
Updated Date - 2023-06-03T16:15:38+05:30 IST