ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pattabhiram: ఏపీ డ్రగ్స్ అడ్డాగా మారింది: పట్టాభిరామ్

ABN, First Publish Date - 2023-04-29T18:26:33+05:30

ఏపీ డ్రగ్స్ (Drugs) అడ్డాగా మారిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీ మూలాలే ఉంటున్నాయని తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఏపీ డ్రగ్స్ (Drugs) అడ్డాగా మారిందని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Kommareddy Pattabhiram) దుయ్యబట్టారు. డ్రగ్స్ ఎక్కడ పట్టుబడినా ఏపీ మూలాలే ఉంటున్నాయని తెలిపారు. రూ.750 కోట్లు విలువైన ట్రెమడాల్ డ్రగ్స్ ఏపీ కేంద్రంగా ఉత్పత్తి.. అయి విదేశాలకు ఎగుమతి అయిందని నిఘా వర్గాల అంచనా వేశాయని తెలిపారు. నరసారావుపేట (Narasaraopeta) కేంద్రంగా సేఫ్ ఫార్ములేషన్స్లో ఉత్పత్తి అయిన.. 10 లక్షల ట్రెమడాల్ ట్యాబ్లెట్ స్ట్రిప్స్ ఫిబ్రవరి 27న పట్టుబడ్డాయని పేర్కొన్నారు. టెర్రరిస్టులు వాడే ట్రెమడాల్ డ్రగ్కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలిపారు.

ట్రెమడాల్ డ్రగ్ను గతంలోనే కేంద్రం నిషేధించిందని గుర్తుచేశారు. డ్రగ్ మాఫియా వల్ల ‘కలెక్షన్ క్వీన్’ మంత్రి విడదల రజిని (Vidadala Rajini) నుంచి.. తాడేపల్లి ప్యాలెస్లో పెద్దల వరకు ముడుపులు అందాయని ఆరోపించారు. డ్రగ్స్ తయారీలో ప్రభుత్వ పెద్దల హస్తం కూడా ఉందని తెలిపారు. జగన్ డ్రగ్ మాఫియాపై సమగ్ర విచారణ జరిపించాలని పట్టాభిరామ్ డిమాండ్ చేశారు.

Updated Date - 2023-04-29T18:26:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising