Chandrababu : చంద్రబాబు బెయిల్ కేసులో హైకోర్టు ఫైనల్‌గా ఏం తేల్చిందంటే..?
ABN, First Publish Date - 2023-11-16T17:07:15+05:30
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. స్కిల్ కేసులో బెయిల్‌పై గురువారం నాడు ఇరుపక్షాల వాదనలు పూర్తయిన తర్వాత కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఇక ఏపీ సీఐఢీ తరపున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. కాగా.. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
పొన్నవోలు వాదనలు ఇవీ..
చంద్రబాబు మెడికల్ రిపోర్టులలో తప్పులు ఉన్నాయి
మూడు 10 రూపాయలు నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్లు చేతులు మార్చారు
చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కు తరలించారు
బోస్ అనే వ్యక్తి ఫోన్ మెసేజ్‌ల ద్వారా ఈ విషయం బయట పడింది
బోస్, కన్వేల్కర్ మెసేజ్‌ల ఆధారంగా మొత్తం డబ్బు హైదరాబాద్ చేరినట్లుగా తెలిసింది
సీమెన్స్ వాళ్లే నిధుల మళ్లింపు జరిగిందని నిర్ధారించారు
సిద్ధార్థ లూథ్రా వాదనలు ఇవీ..
సెమెన్స్ ఫోరెన్సిక్ ఆడిట్‌లోనే మేము అంతా వెరిఫై చేయలేదని రాశారు
ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్ చంద్రబాబును ఇరికించడం కోసం తయారుచేశారు
ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదని ఫోరెన్సిక్ ఆడిట్ చేసినవారే రిపోర్టులో చెప్పారు
ఎలక్షన్స్ ముందు కావాలనే అరెస్ట్ చేశారు
బెయిల్‌పై విచారణ జరిపేటప్పుడు కేసు మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు
2018 నుంచి విచారణ జరుగుతుంటే ఇప్పుడు హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది?
అహ్మదాబాద్ వెళ్లి అక్కడి స్కిల్ ప్రాజెక్ట్ అద్భుతమని ఫైనాన్స్ సెక్రటరీ కె సునీత రిపోర్ట్ ఇచ్చారు
మరలా ఆమెనే CID సాక్షిగా పేర్కొన్నారు
ఇన్నేళ్ల విచారణ తర్వాత చంద్రబాబును జైల్లో ఉంచాల్సిన అవసరం ఏముంది?
స్కిల్ కేసులో ఒక్క చంద్రబాబు మినహా అందరూ బెయిల్‌పై బయట ఉన్నారు
ఫోరెన్సిక్ ఆడిట్‌పై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌కు వికాస్ కన్వేల్కర్ ఫిర్యాదు
సీఐడీ డీజీ సంజయ్, AAG వెళ్లి ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి అడ్వొకేట్ ఎథిక్స్‌కి విరుద్దంగా చంద్రబాబుపై అబద్దాలు ప్రచారం చేశారు
పోలీసు వ్యవస్థ ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ అధికారంలో ఉన్నవారి తొత్తులా ఉండకూడదు
చంద్రబాబుపై నెలన్నరలోనే వరుసగా 6 కేసులు పెట్టారు
చంద్రబాబుపై ప్రభుత్వం ఎంత పెద్దకుట్ర చేస్తుందో అర్థమవుతోంది
Updated Date - 2023-11-16T17:15:34+05:30 IST