ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Minister: పవన్ గ్రాఫ్ పడిపోతోంది.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేకే...

ABN, First Publish Date - 2023-08-22T15:39:21+05:30

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజరోజుకు పడిపోతోందని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) గ్రాఫ్ రోజరోజుకు పడిపోతోందని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (Minister kottu Satyanarayana) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక కలిసి పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఇది విజయం వైసీపీకి దక్కుతుందనటానికి సంకేతమన్నారు. లోకేష్(TDP Leader Nara lokesh) చేస్తుంది యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)కాదు గందరగోళం పాదయాత్ర అని వ్యాఖ్యలు చేశారు. పాదయాత్రకు రూ.250 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యిందని టీడీపీ నేతలు చెబుతున్నారని తెలిపారు. చంద్రబాబు సీఈసీకి ఫిర్యాదు చేస్తే ఏమవుతుంది, లేఖలు రాస్తే ఏమిటి.. ప్రభుత్వమే ఓటర్ల జాబితాను తనిఖీ చేయిస్తోందన్నారు. యువగళం పాదయాత్రలో తన వ్యతిరేకుల పేర్లు రాసుకుంటే ఏమవుతుంది.. రాజకీయ పాదయాత్రకు సెలవులు ఉండవు మరి అంటూ మంత్రి అన్నారు.


నాపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం...

రాష్ట్ర వ్యాప్తంగా రూ.5 లక్షల ఆదాయం కలిగిన 23,600 ఆలయాలను గుర్తించామన్నారు. ఆలయ నిర్వహణ అప్పగించేందుకు కేవలం 37 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని తెలిపారు. వాటికి ధూప దీప నైవేద్య కార్యక్రమం నిర్వహించే అంశంపై యధావిధిగా కార్యాచరణ ఉంటుందన్నారు. ధర్మ ప్రచారం కార్యక్రమం ఏడాది పొడవునా చేపట్టేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాల వారీగా సమీప ప్రాంతాల్లో ధర్మ ప్రచారం కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కళాకారులకు కూడా చేయూత లభిస్తుందన్నారు. ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపడితే కొందరు తనపై వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పట్టణాల్లో దేవాదాయ శాఖ సత్రాలు, మఠాలు ఆక్రమణల చేసేయడాన్ని నిలువరిస్తామని చెప్పారు. దేవాదాయ శాఖకు చెందిన ఏ భూమి అయినా చట్టపరంగా స్వాధీనం చేసుకునేలా ఆర్డినెన్సు ఇచ్చామన్నారు. అన్యాక్రాంతం అయ్యేందుకు వీలు లేకుండా చర్యలు చేపట్టారు. 4.60 లక్షల ఎకరాల భూమి దేవాదాయ శాఖదే అని స్పష్టం చేశారు. 1.65 లక్షల గజాల వాణిజ్య స్థలం ఆక్రమణలో ఉందని మంత్రి కొట్టుసత్యనారాయణ వెల్లడించారు.

Updated Date - 2023-08-22T15:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising