AP Police: ఆ విషయంలో దేశంలో ఏపీ పోలీస్ శాఖ ఎన్నో స్థానంలో వుందంటే...?
ABN, First Publish Date - 2023-02-28T17:54:53+05:30
ఏపీ పోలీస్శాఖకు (AP Police) పలు ఉత్తమ అవార్డులు దక్కాయి. 66వ ఆఖిల భారత పోలీస్ మీట్ 2022లో అవార్డులు ప్రకటించింది.
అమరావతి: ఏపీ పోలీస్శాఖకు (AP Police) పలు ఉత్తమ అవార్డులు దక్కాయి. 66వ ఆఖిల భారత పోలీస్ మీట్ 2022లో అవార్డులు ప్రకటించింది. వృత్తి నైపుణ్యంలో దేశంలో 3వ స్థానంలో నిలిచిన ఏపీ పోలీస్ శాఖ నిలిచింది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు మధ్యప్రదేశ్, భోపాల్లో జరిగిన డ్యూటీ మీట్లో ఏపీ పోలీసులు పాల్గొన్నారు. 2 స్వర్ణ, 3 వెండి, ఒక కాంస్య పతకాలు సాధించారు. విజేతలకు డీజీపీ రాజేంద్రనాథ్రెడ్డి అభినందించారు.
ఇదిలా వుండగా.. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో అయిదు రోజుల పాటు జరిగిన 66వ అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్‌లో మన రాష్ట్ర పోలీస్ శాఖ ఆరు పతకాలతో దేశంలో మూడో స్థానంలో నిలిచింది. వృత్తి నైపుణ్యంలో రెండు బంగారు, మూడు రజత, ఒక కాంస్య పతకాలను అధికారులు పొందారు. స్వర్ణ పతక విజేతలకు రూ.10 వేలు, రజత పతకాలు పొందిన వారికి రూ.8 వేలు, కాంస్య పతకం సాధించిన అధికారికి రూ.5 వేలు చొప్పున నగదు బహుమతిని డీజీపీ అందించారు. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఈ పోలీస్ డ్యూటీమీట్ జరిగింది.
Updated Date - 2023-02-28T17:54:53+05:30 IST