YCP: మేము ఎందుకు భయపడతాం: బొత్స
ABN, First Publish Date - 2023-05-30T18:31:16+05:30
తాము టీడీపీ (TDP) ఎందుకు భయపడతాం.. వాళ్లేమైనా రాక్షసులా..? పులులా..? మేం ఎందుకు భయపడతాం..?అని మంత్రి బొత్స సత్యనారాయణ (botcha satyanarayana) ప్రశ్నించారు.
అమరావతి: తాము టీడీపీ (TDP) ఎందుకు భయపడతాం.. వాళ్లేమైనా రాక్షసులా..? పులులా..? మేం ఎందుకు భయపడతాం..?అని మంత్రి బొత్స సత్యనారాయణ (botcha satyanarayana) ప్రశ్నించారు. టీడీపీ ఓ రాజకీయ పార్టీ.. వాళ్లేం సన్నాసులు కాదన్నారు. ఓ పార్టీగా మేనిఫెస్టోను టీడీపీ (TDP) విడుదల చేసిందన్నారు. చంద్రబాబు (Chandrababu) గతంలో కూడా మేనిఫెస్టోని ప్రకటించారని, అమలు చేయకుండా మాయలు చేశారని విమర్శించారు. వాళ్ల మేనిఫెస్టో గురించి చెప్పేదేం లేదన్నారు. నాలుగేళ్ల పాలన పూర్తైందన్నారు. భగవద్గీత లాంటి మేనిఫెస్టోను తూచా తప్పకుండా పాటించామని తెలిపారు. చెప్పింది చేశామని తాము గర్వంగా చెప్పగలమన్నారు. చంద్రబాబు హయాంలో అన్ని రంగాల్లోనూ వెనుకుందన్నారు. ఇప్పుడు విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాల్లో ముందున్నామని చెప్పారు. విద్యా రంగంలో సమూల మార్పులు తెచ్చామని వ్యాఖ్యానించారు. అలాగే విద్యార్థుల సంఖ్యను పెంచామని బొత్స పేర్కొన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ పెట్టామన్నారు. ఆరోగ్య శ్రీ సేవల సంఖ్యను పెంచామని చెప్పారు. అలాగూ ఫ్యామ్లీ డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చామన్నారు. నాలుగేళ్లల్లో మంచి జరిగిందా..? చెడు జరిగిందా..? ప్రజలే చెబుతారని పేర్కొన్నారు. ‘‘మా పరిపాలన బాగుంటే మమ్మల్ని గెలిపించండని ధైర్యంగా సీఎం జగన్ అడుగుతున్నారు’’ అని పేర్కొన్నారు.
Updated Date - 2023-05-30T18:31:16+05:30 IST