AP News: విశాఖలో పవన్ నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో: నాదేండ్ల
ABN, First Publish Date - 2023-01-03T17:40:03+05:30
బ్రిటిష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా?, సీఎం హోదాలో బెంజ్ సర్కిల్‌లో జగన్ కార్యక్రమాలు చేయలేదా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadenla Manohar) ప్రశ్నించారు. విశాఖలో పవన్ (Pawankalyan) నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అన్నారు.
అమరావతి: బ్రిటిష్ కాలం నాటి చట్టం ద్వారా ఆంక్షలు విధిస్తారా?, సీఎం హోదాలో బెంజ్ సర్కిల్‌లో జగన్ కార్యక్రమాలు చేయలేదా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ (Nadenla Manohar) ప్రశ్నించారు. విశాఖలో పవన్ (Pawankalyan) నిర్బంధానికి కొనసాగింపే చీకటి జీవో అన్నారు. ప్రతిపక్షాలను నియంత్రించేందుకే సభలు, ర్యాలీలు నిషేధిస్తూ హడావుడి జీవో రాష్ట్రంలో ఆర్టికల్ 19 నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించుకుందా? అని ఆయన ప్రశ్నించారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలనూ ఆంక్షల పేరుతో అడ్డుకుంటున్నారని, శాంతిభద్రతల పేరుతో హక్కులు కాలరాయడం రాజ్యాంగ ఉల్లంఘనే అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-01-03T17:40:30+05:30 IST