ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kishan Reddy: కిషన్రెడ్డిని కలిసిన అమరావతి రైతులు.. కారణం ఇదే

ABN, First Publish Date - 2023-02-14T17:36:58+05:30

కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy)ని అమరావతి (Amaravati) రాజధాని రైతులు కలిశారు. రాజధాని రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలను బ్యాంకుల్లో పెట్టుకోవడంలేదని కిషన్రెడ్డి దృష్టికి రాజధాని రైతులు తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు: కేంద్రమంత్రి కిషన్రెడ్డిని (Kishan Reddy) అమరావతి (Amaravati) రాజధాని రైతులు కలిశారు. రాజధాని రిటర్నబుల్ ప్లాట్ల పత్రాలను బ్యాంకుల్లో పెట్టుకోవడంలేదని ఆయన దృష్టికి రైతులు తీసుకెళ్లారు. అలాగే లోన్లు రాకపోవడంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర సంస్థల ఆఫీసులు రాజధానిలో త్వరగా నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రైతుల విన్నపాల పట్ల కిషన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారు.

ఇదిలావుండగా.. రూ. 7వేల కోట్లతో స్వదేశీ దర్శన్ కింద పనులు చేపడుతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి (Kishan Reddy) వెల్లడించారు. మంగళవారం పల్నాడు జిల్లా (Palnadu Dist) పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 50 పర్యాటక కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. గండికోట ఫోర్ట్ (Gandikota Fort), లంబసింగి (Lambasinghi)లో మ్యూజియం (Museum) ఏర్పాటు, రాష్ట్రానికి పర్యాటక అభివృద్ధి కింద రూ. 120 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రూ.27.07 కోట్లతో అమరావతి (Amaravathi) అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. టూరిజం ప్రగతికి ప్రధాని మోదీ (PM Modi) బ్రాండ్ అంబాసిడర్‌ (Brand Ambassador)గా వ్యవహరిస్తున్నారని చెప్పారు. విద్యాసంస్థల్లో యువ టూరిజం క్లబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు.

దేవాలయాల్లో విద్యుత్ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నామని, కొన్ని దేవాలయలు కమర్షియల్‌గా మారాయని కిషన్ రెడ్డి విమర్శించారు. అది మంచి సంస్కృతి కాదని... కాశీ లాంటి ప్రాంతాలకు ప్రతి ఒక్కరు వెళ్లాలని కోరుకుంటారన్నారు. అందుకే పేదలు కాశీ వెళ్లడానికి కొన్ని రాయితీలు ఏర్పాటు చేస్తున్నామని కిషర్ రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-02-14T18:13:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising