ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నెల్లూరులో ఉద్రిక్తం.. మాజీ మంత్రి అనిల్ అనుచరుడిపై కత్తితో దాడి

ABN, First Publish Date - 2023-02-14T20:05:05+05:30

జిల్లాలోని బారాషహీద్‌ దర్గా దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్ యాదవ్ (Anil Kumar Poluboina) , కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది.

నెల్లూరు: జిల్లాలోని బారాషహీద్‌ దర్గా దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్ యాదవ్ (Anil Kumar Poluboina) , కోటంరెడ్డి (Kotamreddy Sridhar Reddy) వర్గీయుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే అనిల్‌ అనుచరుడు సమీర్‌పై కోటంరెడ్డి వర్గీయు కత్తితో దాడికి పాల్పడ్డారు. సమీర్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. దాంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ ప్రదేశంలో పోలీసులు భారీగా మోహరించారు. అసలు ఘర్షణ ఇరు వర్గాల మధ్య ఎందుకు చోటుచేసుకుదనే పూర్తి విషయాలు తెలియాల్సి వుంది.

కోట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి....

వైసీపీ నుంచి నెల్లూరు ఎమ్మెల్యేగా గొలుపొందిన కోట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీపై తిరుగుబాటు చెసిన సంగతి తెలిసిందే. టీడీపీలోకి వెళ్లేందుకు ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబుతోను శ్రీధర్ రెడ్డి మంతనాలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్లుగానే ఆయన రాబోయే ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానంటూ శ్రీధర్ రెడ్డి ప్రకటించుకున్నారు.

మాజీ మంత్రి అనిల్ ఏమన్నారంటే..?

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పౌరుషం ఉంటే, ఆత్మాభిమానం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని, కార్పొరేటర్లు కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి, సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. ఆత్మాభిమానం ఉంది, 13 నెలల అధికారం వదులుకున్నాను, సెక్యూరిటీని త్యాగం చేశాను అంటూ కబుర్లు చెప్పే బదులు ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయొచ్చు కదా అని అడిగారు. రాజీనామా చేయండి, ఆత్మాభిమానం చాటుకోండి అంటూ సవాల్ విసిరారు. దయచేసి మీడియా ముందుకొచ్చి పదే పదే ఆత్మాభిమానం అని చెప్పుకోవద్దని సూచించారు.

Updated Date - 2023-02-14T20:07:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising