ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: ‘మీ కక్షసాధింపులకు ఆయన్ను బలిచేస్తారా?’

ABN, First Publish Date - 2023-05-06T15:59:12+05:30

వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమరావతి: వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సర్వీస్‌లో ఉన్నంతకాలం చిన్నమచ్చలేకుండా పనిచేసి రివార్డులు, ఇంక్రిమెంట్లు, ప్రశంసలు పొందిన జైలుసూపరిండెంట్ రాజారావుని బదిలీచేసిన మీ ప్రభుత్వం, ప్రజాస్వామ్యప్రభుత్వమా ముఖ్యమంత్రిగారు?. గౌరవ హైకోర్ట్ జడ్జిగారి ప్రశంసంలు పొందిన అధికారిని మీ కక్షసాధింపులకు బలిచేస్తారా?’’ అని వర్ల రామయ్య వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 32 సంవత్సరాలుపాటు ఏ రిమార్క్ లేకుండా పనిచేసిన ఎరుకలకులానికి చెందిన అధికారిని అకారణంగా బదిలీచేయడం ఫ్యాక్షన్ రిడన్ గవర్నమెంట్ అయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చట్టాలు ఒక్క వైసీపీ వారికే వర్తిస్తాయా.. మిగతాపార్టీలకు వర్తించవా? అని వర్ల ప్రశ్నించారు. జైల్లో ఉన్న ప్రిజనర్‌ను కలిసేహక్కు టీడీపీనేతలకు లేదా? అని ప్రశ్నించారు. ఇద్దరుఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ప్రిజనర్స్‌ని కలవడానికి జైలుకెళ్తే రెండుగంటలపాటు మండుటెండలో నిలబెట్టాకే రాజారావు వారిని లోపలికి అనుమతించాడని తెలిపారు. సూపరిండెంట్ హోదాలో ఆయనేమీ వారికి ఫేవర్ చేయలేదన్నారు.

Updated Date - 2023-05-06T16:08:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising