ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: సీబీఐ తీరు సామాన్యులకు కూడా వర్తిస్తుందా?: వర్ల

ABN, First Publish Date - 2023-05-31T18:03:39+05:30

వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన అవినాష్ రెడ్డి నిర్దోషి కాదని,...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకా హత్య కేసులో బెయిల్ వచ్చినంత మాత్రాన అవినాష్ రెడ్డి నిర్దోషి కాదని, విచారణ అనంతరం కోర్టు నిర్ణయించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) అన్నారు. వివేకా హత్య కేసులో సీబీఐ (CBI) అనేక తప్పటడుగులు వేసిందన్నారు. అవినాష్ రెడ్డిపై సాక్ష్యాలున్నాయని, అరెస్ట్ చేస్తామని పదే పదే విన్నవించి అవినాష్ రెడ్డి బెయిల్ తెచ్చుకునే వరకు సహకరించిందన్నారు. బెయిల్ పొందిన ముద్దాయి అవినాష్ రెడ్డి పులివెందులలో ప్రజా ధర్బార్ నిర్వహించటం హత్య కేసులో ముద్దాయి అహంకారానికి నిదర్శనమన్నారు. వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పట్ల సీబీఐ వ్యవహరించిన తీరు సామాన్యులకు కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో ముద్దాయిలే నిర్దేశించటం శోచనీయం, వారి అధికార మదానికి నిదర్శనమన్నారు. ఈ కేసులో సీబీఐ క్రెడిబులిటీ కోల్పోయిందని, సీబీఐ డైరక్టర్ ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తును సమీక్షించాలని డిమాండ్ చేశారు.

Updated Date - 2023-05-31T18:03:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising