ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Sarpanches: కేంద్రమంత్రి కపిల్‌మోరేశ్వర్‌ను కలిసిన ఏపీ సర్పంచ్‌లు

ABN, First Publish Date - 2023-08-02T14:50:42+05:30

కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్‌ను ఏపీ సర్పంచ్‌లు బుధవారం కలిశారు.

న్యూఢిల్లీ: కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్‌ను (Union Panchayat Raj Minister Kapil Moreswar Patel)ఏపీ సర్పంచ్‌లు (AP Sarpanch) బుధవారం కలిశారు. టీడీపీ ఎంపీలు కనకమెడల రవీంద్ర కుమార్, కె రామ్మోహన్ నాయుడు, పంచాయతీరాజ్ ఛాంబర్, సర్పంచుల సంఘం నేత వైబి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో కేంద్ర మంత్రితో సర్పంచ్‌లు భేటీ అయ్యారు. ఆర్థిక సంఘం నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని సర్పంచులు ఆందోళన వ్యక్తం చేశారు. పంచాయతీ నిధుల మళ్లింపుపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని సర్పంచ్‌లు కోరారు. నిధులు దారి మళ్లింపులపై కేంద్రమంత్రులకు సర్పంచుల సంఘం ఫిర్యాదు చేసింది.

పంచాయితీలకు రాష్ట్ర ప్రభుత్వ ఇవ్వాల్సిన నిధులు ఇవ్వడం లేదని కేంద్రమంత్రికి వైబీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. వాళ్ళ వాటాగా ఇవ్వవలసిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని.. మరోవైపు కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నారని వాపోయారు. దాదాపు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించారని కేంద్ర మంత్రికి వివరించిన వైబీ రాజేంద్రప్రసాద్ వివరించారు. దీనిపై కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్‌ స్పందిస్తూ.. ఆందోళన చెందవద్దన్నారు. అన్ని విషయాలు పరిశీలిస్తానని తెలిపారు. గ్రామ పంచాయితీల కోసం ఇచ్చిన నిధులను వారి కోసమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. నిధుల మళ్ళింపు పై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తామని సర్పంచ్‌లకు కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర్ పటేల్ హామీ ఇచ్చారు.

Updated Date - 2023-08-02T14:50:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising