ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Atchannaidu: వైసీపీ సంక్రాంతిని జూద దినంగా మార్చింది

ABN, First Publish Date - 2023-01-14T17:56:41+05:30

వైసీపీ (YCP) నేతలు సంక్రాంతిని జూద దినంగా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైసీపీ (YCP) నేతలు సంక్రాంతిని జూద దినంగా మార్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు (Atchannaidu) దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్లను కూడా బ్లాక్ చేసి.. కోడిపందాలు ఆడిస్తున్నారని మండిపడ్డారు. అధికార పార్టీ నేతలు, మంత్రుల ఆధ్వర్యంలోనే జూద కేంద్రాలను నిర్వహించడం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. ప్రశ్నిస్తున్న పోలీసులపై కూడా దాడులకు తెగబుడుతున్నారని మండిపడ్డారు. రాబోయే రెండు రోజులైనా సామాన్యులు.. పండుగను సాఫీగా జరుపుకునేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

సంక్రాంతి (Sankranti)ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని చోట్ల శుక్రవారమే పందేలు మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతుండడం గమనార్హం. పందేల్లో రూ.కోట్ల సొమ్ము చేతులుమారనుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పందేలు జరగనున్నాయి. ఆచంట, తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో వైసీపీ నాయకుల వారసులే పందేల నిర్వహణ బాధ్యత చేపట్టారు. భారీస్థాయిలో పందేలు సాగే బరుల వద్ద సిట్టింగ్‌ ఏర్పాట్లు, ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు.

Updated Date - 2023-01-14T17:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising