Avinash Reddy : ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అవినాశ్
ABN, First Publish Date - 2023-05-22T10:38:07+05:30
వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ : వైఎస్ వివేకా హత్య కేసు ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయమంటూ వార్తలొచ్చాయి. ఈ క్రమంలోనే అవినాశ్ కూడా రెండు సార్లు సీబీఐ ముందుకు వెళ్లకుండా రకరకాల కారణాలు చెప్పి తప్పించుకున్నారు. ఇక నేడు విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈసారి కూడా తన తల్లి అనారోగ్యం కారణంగా తాను హాజరు కాలేనంటూ సీబీఐకి అవినాశ్ లేఖ రాశారు. ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వెకేషన్ బెంచ్ ముందు మెన్షన్ చేయనున్నారు. న్యాయమూర్తులు జెకె మహేశ్వరి, పీఎస్ నరసింహలతో కూడిన వెకేషన్ బెంచ్ ముందు అవినాశ్ తన బెయిల్ పిటిషన్‌ను మెన్షన్ చేయనున్నారు. గతంలో హైకోర్టు వేకేషన్ బెంచ్ ను తన బెయిల్ పిటిషన్ విచారించేలా ఆదేశించాలని సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్ విచారణ తేదీని సుప్రీంకోర్టు ఖరారు చేయలేదు. జూన్ రెండోవారంలో విచారణకు అనుమతిస్తామని చెప్పిన సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం తెలిపింది. ఈ రోజు సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నందున మళ్లీ సుప్రీం వెకేషన్ బెంచ్ ముందు తన బెయిల్ పిటిషన్‌ను అవినాశ్ ఉంచారు. ఇక ఆయన పిటిషన్‌ను వ్యతిరేకించేందుకు వివేకా కూతురు సునీత తరుఫు లాయర్లు సైతం సిద్ధంగా ఉన్నారు.
Updated Date - 2023-05-22T10:46:07+05:30 IST