ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viveka Case: మరోసారి హైకోర్టును ఆశ్రయించిన అవినాష్ రెడ్డి

ABN, First Publish Date - 2023-04-10T15:19:47+05:30

మాజీ మంత్రి వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హైదరాబాద్: మాజీ మంత్రి వివేకానంద హత్య కేసు (YS Vivekananda Case)లో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి (YCP MP Avinash Reddy) మరోసారి తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt)ను ఆశ్రయించారు. గతంలో తాను వేసిన పిటిషన్‌లో మధ్యంతర దరఖాస్తు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐ (CBI) జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇవ్వాలని కోర్టును వైపీపీ ఎంపీ కోరారు. వివేకా హత్య కేసులో ఇటీవల అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. ఇప్పటి వరకు నాలుగు సార్లు సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరయ్యారు. అయితే హత్య కేసులో విచారణకు హాజరుకాకుండా మినహాయింపు కోసం గతంలో అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అవినాశ్‌రెడ్డికి మినహాయింపు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. తన పిటిషన్‌పై తీర్పు వచ్చేవరకు విచారించకుండా అడ్డుకోవాలన్న ఆయన అభ్యర్థననూ తోసిపుచ్చింది. అయితే తీర్పు వెలువరించేదాకా ఆయన్ను అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే.

మరోవైపు ఈ కేసుకు సంబంధించి వైఎస్ భాస్కర్‌రెడ్డి (YS Bhaskar Reddy) పిటిషన్‌పై మరికాసేపట్లో తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగనుంది. ఏ4 నిందితుడు దస్తగిరినీ అవ్రూవర్‌గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తు పిటిషన్ దాఖలైంది. ఇదే అంశంపై ఎం వి కృష్ణారెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటీషన్‌లను కలిపి కాసేపట్లో న్యాయస్థానం విచారణ జరుపనుంది. కాగా.. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగానే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను సీబీఐ విచారించింది. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి స్టేట్మెంట్ ఇస్తున్నారని భాస్కర్ రెడ్డి ఆరోపించారు. కీలక పాత్ర పోషించిన దస్తగిరికి బెయిల్ ఇవ్వటం సరికాదన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరినే అని తెలిపారు. దస్తగిరి బెయిల్ సమయంలోను సీబీఐ సహకరించిందని చెప్పారు. దస్తగిరిపై ఉన్న ఆధారాలను కింది కోర్టు పట్టించుకోలేదని అన్నారు. దస్తగిరికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - 2023-04-10T15:19:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising