ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

YuvagalamPadayatra: బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించాం: లోకేశ్‌

ABN, First Publish Date - 2023-04-16T15:22:14+05:30

బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra)లో భాగంగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా ప్రోత్సహించామని టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. యువగళం పాదయాత్ర (YuvagalamPadayatra)లో భాగంగా మారెళ్లలో బీసీ నేతలతో లోకేశ్‌ ముఖాముఖి నిర్వహించారు. బీసీలకు స్థానికసంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు. అక్రమ కేసులతో బీసీలను జగన్‌ సర్కార్‌ వేధిస్తోందని దుయ్యబట్టారు. బీసీ కార్పొరేషన్‌ (BC Corporation)ను జగన్‌రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. ఒక్క అవకాశం అనగానే మోసపోయి.. ప్రజలు తన్నే దున్నపోతును తెచ్చుకున్నారని తెలిపారు. బీసీలను అణిచివేసేందుకు జగన్‌ అనేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ప్రత్యేక బీసీ రక్షణ చట్టం తెస్తామని లోకేశ్‌ ప్రకటించారు.

రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం: లోకేశ్‌

రాయలసీమ నీటి సమస్యల పరిష్కారానికి మాజీసీఎం చంద్రబాబు (Chandrababu) కృషిచేశారని తెలిపారు. సీమ ప్రాజెక్టుల కోసం చంద్రబాబు రూ.11 వేల కోట్లు ఖర్చుచేస్తే.. జగన్ గత నాలుగేళ్లలో 10% కూడా ఖర్చు చేయలేదని ధ్వజమెత్తారు. డ్రిప్ ఇరిగేషన్ (DripIrrigation) కట్ చేసి సీమ రైతులను కోలుకోలేని దెబ్బతీశారని తెలిపారు. రాయలసీమలోని పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని లోకేశ్‌ ప్రకటించారు. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, వైసీపీ ప్రభుత్వం విపరీతంగా పన్నులు పెంచిందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-04-16T15:22:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising