ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhavanapadu Port: భావనపాడు పోర్టుకు పేరు మార్పు

ABN, First Publish Date - 2023-04-16T19:16:44+05:30

శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సంతబొమ్మాళి మండలం భావనపాడు పోర్టు (Bhavanapadu Port) పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సంతబొమ్మాళి మండలం భావనపాడు పోర్టు (Bhavanapadu Port) పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో భావనపాడులో పోర్టు నిర్మించతలపెట్టారు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాలతో ఇదే మండలంలోని మూలపేటలో పోర్టు నిర్మించాలని నిర్ణయించారు. ఈ మేరకు భూ సేకరణ పనులు చేపట్టారు. కానీ భావనపాడు పేరుతోనే కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. తాము పోర్టు కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేశామని.. పోర్టు పేరు తమ గ్రామం పేరుతో ఉండాలని మూలపేట వాసులు గతంలో నిర్వహించిన వివిధ సమావేశాల్లో కలెక్టర్‌ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌కు, అధికారులకు విన్నవించారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కలెక్టర్‌ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో భావనపాడు పోర్టు పేరును మూలపేట పోర్టుగా మార్చుతూ.. రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్‌ చీప్‌ సెక్రటరీ ఆర్‌.కరికల్‌ వలెవన్‌ ఉత్తర్వులు (మెమోనెంబర్‌. ఐఎన్‌101 పోర్ట్స్‌44/2020 డేటెడ్‌ 16-04-2023) జారీ చేశారు.

Updated Date - 2023-04-16T19:16:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising