ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bandi Sanjay : ఏపీ బీజేపీ ఇన్‌చార్జ్‌గా బండి సంజయ్‌!

ABN, First Publish Date - 2023-07-30T11:34:20+05:30

బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది...

  • జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎంపిక

  • దక్షిణాది నుంచి ఒక్క సంజయ్‌కే చాన్స్‌

  • సునీల్‌ స్థానంలో ఏపీ బాధ్యతలు?

హైదరాబాద్‌/న్యూఢిల్లీ, జూలై 29(ఆంధ్రజ్యోతి): బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ని (Bandi Sanjay) పార్టీ అధిష్ఠానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. శనివారం ప్రకటించిన 8మంది జాబితాలో దక్షిణాదినుంచి సంజయ్‌కే చోటు దక్కింది. కాగా, బండి సంజయ్‌ను ఏపీ బీజేపీ (AP BJP) వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ ఇన్‌చార్జ్‌ సునీల్‌ దేవ్‌ధర్‌ను (Sunil Deodhar) జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో బలమైన నాయకుడిని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఫైర్‌బ్రాండ్‌ నాయకుడిగా పేరున్న సంజయ్‌ను ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమించడం ద్వారా వైసీపీ ప్రభుత్వంపై పోరాడేందుకు బలమైన గళం అందివస్తుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.


సునీల్‌ తొలగింపు వెనుక..?

కాగా.. రాష్ట్ర బీజేపీ సహ ఇన్‌చార్జి, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సునీల్‌ దేవ్‌ధర్‌ను పార్టీ పక్కన పెట్టేసింది. ఐదేళ్లుగా పార్టీపరంగా ఏపీకి అందించిన సేవలు చాలంటూ ఉద్వాసన పలికింది. శనివారం పార్టీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన జేపీ నడ్డా తన బృందంలో సునీల్‌కు చోటివ్వలేదు. మహరాష్ట్రకు చెందిన సునీల్‌ దేవ్‌ధర్‌ బీజేపీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. ఆరేళ్ల క్రితం అప్పటి అధ్యక్షుడు అమిత్‌షా ఆయనను నియమించారు. 2018, జూలై 30న రాష్ట్ర సహ ఇన్‌చార్జిగా నియమించారు. అయితే ఏపీలో సునీల్‌ సేవలు ఆది నుంచి వివాదాస్పదమే అయ్యాయి. సోషల్‌ మీడియాలో ట్వీట్లు పెట్టడం తప్ప క్షేత్రస్థాయిలో దేవ్‌ధర్‌ పనితీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో ఉందనే వార్తలు వినిపించాయి. ముఖ్యంగా మీడియా ముందు రాష్ట్ర సర్కారుపై విమర్శలు చేస్తూనే.. తెరవెనుక రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో చెలిమి చేస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో బీజేపీ పెద్దలు జాతీయ కార్యవర్గం నుంచి తప్పించారనే చర్చసాగుతోంది. ఇదిలావుంటే, రాష్ట్రం నుంచి జాతీయ కార్యదర్శిగా కొనసాగుతున్న వై.సత్యకుమార్‌ను అదే స్థానంలో కొనసాగించారు.

Updated Date - 2023-07-30T11:37:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising